For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా తొలి ఉద్యోగం చిన్న కంపెనీలో.. జీతం వందల్లోనే.. సూర్య సంపాదన ఎంతంటే!

  |

  విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా చిత్రం కెప్టెన్ గోపినాథ్ రాసిన సింప్లి ఫ్లై అనే బుక్ ఆధారంగా రూపొందుతున్నది. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం నవంబర్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అవుతున్నది. గురు ఫేమ్ సుధా కొంగర దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను కూడగట్టుకొన్నది. ఈ క్రమంలో ఫిల్మీబీట్‌తో సూర్య ముచ్చటిస్తూ ఈ సినిమా విశేషాలు తెలిపారు.

  Recommended Video

  Hero Surya Grand Entry In Tollywood
  కెప్టెన్ గోపినాథ్ జీవితంలోని ముఖ్య సంఘనల ఆధారంగా

  కెప్టెన్ గోపినాథ్ జీవితంలోని ముఖ్య సంఘనల ఆధారంగా

  స్పైస్ జెట్ విమాన సంస్థ అధినేత కెప్టెన్ గోపినాథ్ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా ఆకాశమే నీ హద్దురా చిత్రం రూపొందింది. ఒక సామాన్య టీచర్ కుమారుడు దేశంలోనే ప్రముఖ వైమానిక రవాణా సంస్థకు ఎలా అధినేతగా మారాడు. ఒక్క రూపాయికే సామాన్యులను ఎలా విమానం ఎక్కించారు అనే ముఖ్య సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచేలా ఉంటుంది అని సూర్య తెలిపారు.

  నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ..

  నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ..

  డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మా నాన్న నన్ను ఓ కంపెనీలో పెట్టారు. డబ్బు కోసం కాకుండా కష్టం విలువ తెలియజెప్పడానికే ఆయన అలా చేశారు. నేను ఓ కంపెనీలో చేరి సంపాదించింది వందల్లోనే. నా తొలి సంపాదన కేవలం 700ల రూపాయలు మాత్రమే అని సూర్య తెలిపారు. కిందిస్థాయి నుంచి పారిశ్రామికవేత్తగా మారిన ఓ స్కూల్ టీచర్ కొడుకు కథే ఆకాశమే నీ హద్దురా అంటూ సూర్య అన్నారు.

  సుధా కొంగర అలా టార్చర్ పెట్టింది..

  సుధా కొంగర అలా టార్చర్ పెట్టింది..

  ఆకాశమే నీ హద్దురా సినిమా కథ నాకు చెప్పినప్పుడు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే నాకు సుధాతో చాలా కాలంగా నాకు పరిచయం ఉంది. యువ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన పరిచయం మరింత బలపడింది. అప్పటి నుంచి నాకు రాఖీ సిస్టర్‌గా మారింది. యువ షూటింగులో ఓ సీన్‌కు దర్శకుడు మణిరత్నం ఒకే చెప్పినా.. దర్శకత్వం శాఖలో ఉన్న సుధా ఒప్పుకోలేదు. ఆ సీన్ విషయంలో టార్చర్ పెట్టింది అని సూర్య చెప్పారు.

  ఆకాశమే నీ హద్దురా కోసం డ్రిల్ మాస్టర్‌గా

  ఆకాశమే నీ హద్దురా కోసం డ్రిల్ మాస్టర్‌గా

  అలాగే ఆకాశమే నీ హద్దురా సినిమా షూటింగులో కాంప్రమైజ్ కాలేదు. తనకు నచ్చే వరకు సీన్‌ను నాతో చేయించి ఓ రకమైన టార్చర్ పెట్టారు. దాదాపు ఆమె డ్రిల్ మాస్టర్‌ మాదిరిగా వ్యవహరించింది. దాని సినిమాలో మంచి ఫీల్, అవుట్‌పుట్ వచ్చింది అంటూ సరదగా సూర్య చెప్పుకొంటూ వచ్చారు.

  థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్.. కానీ

  థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్.. కానీ

  ఆకాశమే నీ హద్దురా చిత్రం తప్పుకుండా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో తప్పనిసరిగా సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. కాకపోతే ఈ చిత్రాన్ని ఇంటి సభ్యులందరూ హ్యాపీగా అందరు కలిసి చూడటానికి వీలు పడుతుంది. ఇంటిలో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందని అనుకొంటున్నాను అని సూర్య పేర్కొన్నారు.

  English summary
  Suria aka Suriya Sivakumar's latest movie is Aakasham Nee Haddhu Ra which is Soorarai Pottru in Tamil. It is directed by the Guru Fame Sudha Kongara. This movie is set to release on Novemeber 9 on Amazon Prime Video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X