For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా కెరీర్‌ను బాహుబలి అలా చేసింది.. సైరాలో చిరంజీవితో నటించడం.. తమన్నా (ఇంటర్వ్యూ)

  |
  Tamannaah Special Interview About Next Enti Movie | Filmibeat Telugu

  మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్‌ ఓ పక్క విజయాలు, మరోపక్క అపజయాలతో సాగిపోతున్నది. రొమాంటిక్ పాత్రల్లో కనిపిస్తూనే బాహుబలి లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సైరా, దటీజ్ మహాలక్ష్మీ తదితర చిత్రాలతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నది. ప్రస్తుతం నెక్ట్స్ ఏంటీ అనే చిత్రంలో గ్లామర్‌ రోల్‌లోనూ, అలాగే బాధ్యతాయుతమైన యువతి పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు కునాల్ కోహ్లీ నేరుగా తెలుగులో రూపొందిస్తున్న నెక్ట్స్ ఏంటీ చిత్రం డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో తమన్నా ముచ్చటించారు. తమన్నా వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

  నా వయసుకు తగిన పాత్రలో

  నా వయసుకు తగిన పాత్రలో

  చాలా కాలంగా నా వయసుకు తగ్గిన పాత్రల్లో నటించాలని అనుకొంటున్నప్పుడు డైరెక్టర్ కునాల్ కోహ్లీ నాకు నెక్ట్స్ ఎంటీ అనే సినిమా కథ చెప్పారు. చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. కానీ ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయలేదు. కంటెంట్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. సినిమా అంతా లండన్‌లో జరుగుతుంది. ఓ అమ్మాయి జర్నీలా సినిమా ఉంటుంది.

  చీర కట్టుకొంటే ఆంటీ అంటారు

  చీర కట్టుకొంటే ఆంటీ అంటారు

  సాధారణంగా అమ్మాయికి చాలా రకాలుగా పేర్లు, ట్యాగులు ఉంటాయి. చీరకట్టుకొంటే ఆంటీ అంటారు. షార్ట్స్, మినీస్ వేసుకొంటే మరో పేరు పెడుతారు. అమ్మాయిలకు సొంత నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండదు. కానీ అలాంటి అవకాశం కల్పించాలి. పెద్దల తమ పిల్లల అభిప్రాయలను ఎలా ట్రీట్ చేస్తారు. రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. రొమాన్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా. బాక్సాఫీస్ వద్ద యూత్ సబ్జెక్ట్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. అందుకే ఈ సినిమాలో నటించాలని అనుకొన్నాను.

  ఎప్పుడూ సెక్స్ ఆలోచనేనా? నువ్వు 2 మినిట్స్ గాడివే: తమన్నా మాటలు హాట్ టాపిక్

   తెలుగు సినిమా మారిపోయింది

  తెలుగు సినిమా మారిపోయింది

  గత రెండు ఏళ్లలో తెలుగు సినిమా చాలా మారిపోయింది. చాలా కొత్త కథతో సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరిస్తున్నారు. అందుచేతనే బాలీవుడ్‌లో మన చిత్రాలు రీమేక్ అవుతున్నాయి. అలాంటి కోవలోనే వచ్చే సినిమా నెక్ట్స్ ఏంటీ. ఈ సినిమా చూసి హ్యాపీగా ప్రేక్షకులు బయటకు వస్తారు. హాలీవుడ్‌లో ఉడీ అలెన్ పాత్ర మాదిరిగా నా పాత్ర ఉంటుంది.

  నా స్వభావానికి చాలా దగ్గరగా

  నా స్వభావానికి చాలా దగ్గరగా

  నెక్ట్స్ ఎంటీ సినిమా కథ చదివినప్పుడు కథకు చాలా కనెక్ట్ అయ్యాను. కథలోని పాత్ర నా స్వభావానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను చెప్పిన డైలాగ్స్‌కు నాక నేను రిలేట్ అయ్యాను. అందుకే నా నిక్‌నేమ్‌ను ఈ సినిమాలో పెట్టమని దర్శకుడిని కోరాను. దాంతో సినిమాలో నా పాత్రకు టామీ అని పేరు పెట్టారు. సందీప్ కిషన్, నవదీప్ ఈ సినిమాలొని హీరోల పాత్రకు సరిగ్గా సరిపోతారు. సందీప్ అనగానే నాకు కొంత ఎనర్జీ వచ్చింది. నవదీప్‌తో కంఫర్ట్ ఫీలయ్యాను.

   తండ్రీ, కూతుళ్ల కథగా

  తండ్రీ, కూతుళ్ల కథగా

  నెక్ట్స్ ఎంటీ చిత్రంలో నా తండ్రిగా శరత్ బాబు సర్ నటిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎక్కువగా తండ్రి, కొడుకుల మధ్య రిలేషన్‌పై సినిమాలు వచ్చాయి. కానీ కూతురు, తండ్రి మధ్య రిలేషన్‌పై ఈ సినిమా చెబుతుంది. శరత్ బాబు గారు సింగిల్ పేరెంట్‌. ఆయన కూతురిగా నేను నటించాను. తండ్రి, కూతుళ్లు రిలేషన్ కాకుండా వారి మథ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే కనిపిస్తుంది.

  భాష అనేది సమస్య కాలేదు

  భాష అనేది సమస్య కాలేదు

  నెక్ట్స్ ఏంటి సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్. తెలుగు తీయడానికి దర్శకుడు కునాల్ కోహ్లీకి ఎలాంటి కష్టం కాలేదు. భాష అనే కేవలం కమ్యూనికేషన్ మాత్రమే. లండన్‌లో షూట్ చేయడం వల్ల భాష సమస్య రాలేదు. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ రూరల్ అయితే కునాల్ కష్టం ఉండేది. గ్రామీణ కథ ఉంటే లాంగ్వేజ్, నేటివిటీ గురించి ఆలోచించాల్సి వచ్చేది. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు రాలేదు.

  బాహుబలి మూవీతో

  బాహుబలి మూవీతో

  నా కెరీర్‌లో బాహుబలి సినిమా మంచి గుర్తింపునిచ్చింది. నా మీద నమ్మకం పెట్టుకొని అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం అదృష్టమే. అలాంటి పాత్రలు చేయడం వల్ల నాపై నాకు నమ్మకం కలిగింది. నెక్ట్స్ ఎంటీ సినిమాలోని రోల్ నా కెరీర్‌కు ప్లస్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవితో సైరాలో నటించే అవకాశం దక్కింది. సైరాలో నా పాత్రఏంటో చెప్పలేను. ఇంకా షూటింగ్ మిగిలి ఉంది. క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇక తమిళ చిత్రంలో నటిస్తున్నాను. సూర్యతో రెండోసారి నటించడం హ్యాపీగా ఉంది.

  English summary
  Next Enti? is an upcoming Telugu-language romantic comedy film directed by Kunal Kohli. The film stars Tamannaah, Sundeep Kishan in a lead roles and Navdeep, Poonam Kaur plays a supporting roles. It is based on the Hindi-language film Hum Tum. This movie set to release on December 7th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X