twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్లు.. డైరెక్టర్ల కోరికలతో షాక్..ఇండస్ట్రీ పరువు బజారులోకి.. తేజస్విని మదివాడ

    |

    కమిట్‌మెంట్, మీటూ కంటెంట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ రియల్ స్టోరీలు, బయోపిక్ వచ్చాయి. ఈ సినిమా విషయానికి వస్తే.. వాస్తవాలు పొందుపరిచిన డాక్యుమెంటరీలా ఉంటుంది. ఈ సినిమాలో నలుగురి కథలు ఉంటాయి. ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ సాగుతుంది. నా కథ గురించి నేను చెబుతున్నాను. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చి.. రకరకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్న ఔత్సాహిక నటిగా నేను నటించాను అని తేజస్వి పేర్కొన్నారు. ఇంకా ఈ సినిమా గురించి, ఇండస్ట్రీలో వేధింపుల గురించి సంచలన విషయాలను తేజస్వి వెల్లడిస్తూ..

    కమిట్ రిలీజ్ అందుకే ఆగింది..

    కమిట్ రిలీజ్ అందుకే ఆగింది..

    కమిట్‌మెంట్ ప్రమోషన్స్ గతంలో జరిగాయి.కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. మళ్లీ ఈ సినిమా కోసం ప్రమోషన్స్ రెండోసారి చేస్తున్నాం. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ మా నిర్మాత ఈ సినిమాను థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని బలంగా నమ్మారు. అందుకోసమే నా బాధ్యతగా ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నాను అని తేజస్వి మదివాడ చెప్పారు.

    లక్ష్మీకాంత్ కథ చెప్పగానే..

    లక్ష్మీకాంత్ కథ చెప్పగానే..


    కమిట్‌మెంట్ సినిమా విషయానికి వస్తే.. నేను యాక్టింగ్ నుంచి తప్పుకోవాలని అనుకొంటున్న సమయంలో, అలాగే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ప్రాంతాలకు వెళ్లి ట్రావెల్ చేసి వచ్చాను. ఆ సమయంలో దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా నా వద్దకు వచ్చి కథ చెప్పారు. ఈ కథ నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండటంతో నేను ఈ సినిమాను ఒప్పుకొన్నాను. ప్రతీ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పడే బాధలు, ఎదుర్కొన్న సంఘటనలు ఈ మూవీలో ఉంటాయి అని తేజస్వి చెప్పారు.

    శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో

    శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో


    తెలుగు సినిమా ప్రముఖులపై, ఇండస్ట్రీపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో చాలా మందికి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. కమిట్‌మెంట్ సినిమా అలాంటి ప్రశ్నలకు కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం లక్ష్మికాంత్ చేశారు. ఆ విషయం నచ్చే నేను ఈ సినిమా చేశాను. కమిట్‌మెంట్ సినిమా చేసిన సమయంలో చాలా కిక్ వచ్చింది. అదే కిక్ ప్రేక్షకులకు కూడా కలుగుతుంది అని తేజస్వి అన్నారు.

    ఎవరినీ బద్‌నాం చేయడం లేదు

    ఎవరినీ బద్‌నాం చేయడం లేదు

    కమిట్‌మెంట్ సినిమా ట్రైలర్, టీజర్లు చూస్తే సినిమా ఇండస్ట్రీ పరువు బజారున పడేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీ పరువును పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ప్రతీ ఇండస్ట్రీలో కాంప్రమైజ్, కమిట్‌మెంట్ తప్పదు. మేము ఎవరిని బద్‌నాం చేయడం లేదు అని తేజస్వి చెప్పారు. చాలా మందికి ఇండస్ట్రీలో జరిగే విషయాలు తెలియవు. అలాంటి ఎన్నో ప్రశ్నలకు చాలా సమాధానాలు దొరుకుతాయి. ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టడంలో తప్పేమీ లేదు అని తేజస్వి మదివాడ చెప్పారు.
    మేనేజర్లు, డైరెక్టర్లు మాట్లాడే తీరుతో

    మేనేజర్లు, డైరెక్టర్లు మాట్లాడే తీరుతో


    సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మేనేజర్లు, డైరెక్టర్లు మాట్లాడే మాటలకు షాక్ అయ్యేదానిని. వారి మాటలకు ఎలా సమాధానం, స్పందించాలో తెలిసేది కాదు. ఆ తర్వాత నాకు ఇండస్ట్రీ పరిస్థితులు అర్ధమయ్యాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత నాకు పరిస్థితులన్నీ అర్ధమయ్యాయి. వాటికి ఎలా రియాక్ట్ కావాలో తెలిసింది. అయితే సినిమా ఇండస్ట్రీని బద్‌నామం చేయడానికి ప్రయత్నించడం లేదు. నాకు సినిమా ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెట్టి జీవితాన్ని ఇచ్చింది. అందుచేత చెడు లేదని చెప్పను. కేవలం ఈ సినిమా ఒక మెసేజ్ మాత్రమే అని తేజస్వి వెల్లడించారు.

    కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు

    కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు


    కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలను అలర్ట్ చేయడానికో లేదా కంప్రమైజ్ కావాలని చెప్పడానికో ఈ సినిమా చేయడం లేదు. చాలా ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చే వారికి ఈ సినిమా ఒక మెసేజ్. మేము కొన్ని సమస్యలను చర్చిస్తున్నాం. ఈ సినిమా కథ నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. నా జీవితంలోని అనుభవాలు కూడా సినిమాలో ఉన్నాయి అని తేజస్వి చెప్పారు.

    English summary
    Actor and Bigg Boss Telugu fame Tejaswi Madivada's latest movie commitment. This movie is set to release on August 19th. Here is the Tejaswi's exclusive Interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X