For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రీమేక్ చేస్తే ఎస్పీబీ తిడతారు.. వెంకీమామ చూసి ఏడ్చేశాను.... తమన్ కామెంట్స్

  |

  మ్యూజిక్ సెన్సేషన్ తమన్.. ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. ఎక్కడ చూసినా తమన్ పాటలే హోరెత్తిస్తుండగా ఫుల్ ఖుషీలో ఉన్నట్టున్నాడు. ఒకప్పుడు క్యాపీ క్యాట్ అంటూ వేలెత్తి చూపిన వార.. తమన్ పాటలను వింటూ పరవశించి పోతున్నారు. సామజవరగమన అని క్లాసిక్ టచ్ ఇచ్చినా.. రాములో రాముల అంటూ మాస్ బీట్‌తో దుమ్ములేపినా.. ఓ బావా అంటూ ఆట పట్టించినా.. వెంకీ మామ అంటూ మామలోని అనుబంధాన్ని తెలిపినా అది తమన్ సొంతమే. తన సంగీతంతో అందర్నీ మెప్పిస్తోన్న తమన్.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించాడు.

  కథలే కారణం..

  కథలే కారణం..

  ఇప్పుడొస్తున్న పాటలు కొత్తగా ఉండటానికి ప్రతీ పాట డిఫరెంట్‌గా ఉండటానికి కారణమే కథలేనని పేర్కొన్నాడు. ప్రతీ కథ భిన్నంగా ఉందని వెంకీ మామ ఎమోషనల్ కంటెంట్.. ప్రతీరోజు పండగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. అల వైకుంఠపురములో ఫన్‌తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని ఇలా ప్రతీ సినిమా డిఫరెంట్‌గా ఉండటంతో పాటలు కూడా కొత్తగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

  గ్యాప్ ఇవ్వడమే కలిసొచ్చింది..

  గ్యాప్ ఇవ్వడమే కలిసొచ్చింది..

  సరైనోడు చిత్రం తరువాత ఓ ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చాడని, ఆ సమయంలో చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. అలా గ్యాప్ ఇవ్వడమే ఇప్పుడు మంచి ఫలితమిచ్చిందన్నట్లుగా తెలిపాడు. ఆ సమయంలోనే సంగీతం గురించి మరింత లోతుగా తెలుసుకున్నానని అన్నాడు.

   రీమేక్ చేస్తే.. ఎస్పీబీ తిడతారు

  రీమేక్ చేస్తే.. ఎస్పీబీ తిడతారు

  తనకు పాత పాటలు (రెట్రో) చేయడం ఇష్టమేనని అయితే రీమేక్‌లకు ప్రస్తుతం దూరంగానే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. క్లాసిక్ పాటలను రీమేక్ చేసి చెడగొట్టదలుచుకోలేదని, అందరూ తిట్టుకుంటారని అన్నాడు. రీమేక్ చేస్తే.. మనకెందుకురా అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిడతారని చెప్పుకొచ్చాడు.

  విమర్శలను కూడా తీసుకోవాలి..

  విమర్శలను కూడా తీసుకోవాలి..

  విమర్శలను కూడా తీసుకోవాలి.. అలా తీసుకుంటూనే కొత్తగా చేయగలుగుతామని, వారికి నచ్చేలా మ్యూజిక్ ఇవ్వగలమని అన్నాడు. అందుకే తాను పబ్లిక్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతానని, సోషల్ మీడియాలో రిప్లై ఇస్తుంటానని తెలిపాడు.

   మేమంతా ఒక్కటే..

  మేమంతా ఒక్కటే..

  ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ పని అయిపోయిందని, తమన్ ట్రెండ్ నడుస్తోందని బయట కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బయట ఇలా జరుగుతుంటే.. మ్యూజిక్ డైరెక్టర్లుగా వారిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందోననే ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే అలా తామెప్పుడు ఫీల్ కామని, నెంబర్ వన్ అంటూ గేమింగ్ ఉండదని, తామంతా నిత్యం టచ్‌లోనే ఉంటామని చెప్పుకొచ్చాడు. తమకు సంబంధించి వాట్సప్ గ్రూప్‌లుంటాయని, వాటిలో ప్రతీ రోజూ మాట్లాడుకుంటామని తామంతా ఒక్కటేనని తెలిపాడు.

  #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
   వెంకీమామను చూసి ఏడ్చేశాను..

  వెంకీమామను చూసి ఏడ్చేశాను..

  వెంకీమామ చిత్రాన్ని ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా, డబ్బింగ్, రీ రికార్డింగ్ లేకుండా చూశానని చెప్పుకొచ్చాడు. ఒక్కసారిగా ఎమోషనల్ అయి ఏడ్చేశానని తెలిపాడు. సినిమా ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ చేస్తుందని అన్నాడు. వెంకీమామ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని, డిసెంబర్ 13న రాబోతోందని తెలిపాడు.

  English summary
  Thaman Interaction with Media About Venky Mama. He Said Some Interesting Facts About Venky Mama. This Movie Is Directed By Ks Ravindra. Produced Under Suresh Production. Venky Mama Is Going To Release On 13th December.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X