twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ghani వరుణ్ తేజ్ కష్టం మాటల్లో చెప్పలేం.. ఆ బాక్సర్ సినిమాలు చూసి.. అల్లు బాబీ, సిద్దూ ఎమోషనల్

    |

    2009 నుంచి జస్ట్ టికెట్ వెబ్‌సైట్, క్యూబ్ లాంటివి డెవలప్ చేస్తూ ఉన్నాను. ఆ ప్రాసెస్‌లో ఇండస్ట్రీకి సంబంధించిన పనుల్లో ఉన్నాను. కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన తెర వెనుక బిజీగా ఉన్నాను. ప్రస్తుతం నేను తెర ముందుకు వచ్చాను. స్పోర్ట్స్ డ్రామాగా ఓ సినిమా చేద్దామని అనుకొంటుండగా.. కిరణ్ ఐడియా చెప్పారు. బాక్సింగ్ నేపథ్యంగా అలా గని సినిమా ప్రారంభమైంది. బాక్సింగ్ అనగానే.. అమ్మా, నాన్న, తమిళ అమ్మాయి అనగానే తల్లి, కొడుకుల మధ్య కథ, గని విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ క్యారెక్టర్ జర్నీ అని నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు చెప్పారు.

     బాక్సింగ్ నేపథ్యంగా వరుణ్ తేజ్

    బాక్సింగ్ నేపథ్యంగా వరుణ్ తేజ్


    నాలుగేళ్ల క్రితం గని ప్రారంభమైంది. మధ్యలో కరోనావైరస్ లాక్‌డౌన్స్‌తో సినిమా ఆగిపోయింది. బాక్సింగ్ నేపథ్యంగా వచ్చే సినిమాకు మరో సినిమాతో పోల్చుకోవద్దు. ఈ క్రీడాకారుడి జీవితంలో చీకటి వెలుగులు ఉంటాయి. ఈ కథలో కూడా అలాంటి ఎమోషనల్ అంశాలు ఉంటాయి. గని అనే బాక్సర్ జీవితంలో విజయాలు, అపజయాలు.. ఆ తర్వాత రియలైజేషన్ ఉంటుంది. ఆ పాత్ర చుట్టూ క్యారెక్టర్లు ఉంటాయి. గని సినిమాకు చాలా టైటిల్స్ అనుకొన్నాం. కానీ చివరకు గని టైటిల్‌కు ఒకే చెప్పాం అని అల్లు బాబీ చెప్పారు.

    అల్లు అరవింద్ అండగా నిలిచి..

    అల్లు అరవింద్ అండగా నిలిచి..


    లాక్‌డౌన్ అనేది తొలి చిత్ర నిర్మాతలుగా మాకు చాలా ఇబ్బందులు కలిగాయి. కరోనావైరస్ అనేది కేవలం మాకు మాత్రమే కాదు. ప్రపంచ సినిమాను వెంటాడింది. రెండు సార్లు స్టేడియం సెట్స్ వేశాం. అలా మాకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా నాన్న మాకు మెంటర్‌గా ఉండటం కారణంగా ఆర్థిక సమస్యలు పెద్దగా ప్రభావం చూపలేకోయాయి. ఒక తొలి చిత్ర నిర్మాతకు అల్లు అరవింద్ లాంటి మెంటర్ ఉంటే ఎంత లాభం ఉంటుందో మాకు తెలిసింది అని అల్లు బాబీ, సిద్దూ చెప్పారు.

    తెలుగు, కన్నడ భాషల్లో

    తెలుగు, కన్నడ భాషల్లో

    గని సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఉపేంద్ర, సునీల్ శెట్టి ఈ సినిమాలో కీలకంగా ఉంటాయి. ఉపేంద్ర పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. కన్నడలో ఆయనకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌కు తగినట్టుగా సినిమా ఉంటుంది. అందుకే రెండు భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే హిందీలో కూడా రిలీజ్ చేసి ప్యాన్ ఇండియా స్థాయిని గనికి కల్పించాలని ఆలోచిస్తున్నాం అని అల్లు బాబీ, సిద్దూ తెలిపారు.

     టోని జెఫ్రీస్ వద్ద శిక్షణ

    టోని జెఫ్రీస్ వద్ద శిక్షణ

    బాక్సింగ్ నేపథ్యంగా గని సినిమా అనుకొన్నప్పుడు ఒలంపిక్ బాక్సింగ్ క్రీడాకారుడుట టోని జెఫ్రీస్ వద్ద బాక్సింగ్ శిక్షణ తీసుకొన్నారు. బేసిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకొన్నాడు. తెలుగులో మిక్సింగ్ బాక్సింగ్ ఉంటాయి. ఈ సినిమాలో ప్రో బాక్సింగ్ సినిమాలు ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంగా కిక్ బాక్సింగ్ తదితర అంశాలు ఉంటాయి. ఈ బాక్సింగ్‌లో లెగ్ వర్క్ ఉంటుంది. ఒక బాక్సర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ కావడానికి వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. మహ్మద్ ఆలీ సినిమాలు, వీడియోలు చూశాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని అల్లు బాబీ, సిద్దూ తెలిపారు.

    వరుణ్‌తో సినిమా ఎందుకంటే?

    వరుణ్‌తో సినిమా ఎందుకంటే?


    నేను నిర్మాతగా మారుతున్నప్పుడు అల్లు అరవింద్ గారు నాకు ఒకటే మాట చెప్పాడు. గీతా ఆర్ట్స్ ప్రతిష్టను తగ్గించేలా సినిమాలు ఉండకూడదు. అందుకే మా కుటుంబ ప్రతిష్టను పెంచేలా అల్లు బాబీ అనే ప్రొడక్షన్‌ను ప్రారంభించాను. మంచి సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తాను. సిద్దూ నాకు కజిన్. అలాగే వరుణ్ తేజ్ కూడా నాకు కజిన్. కేవలం మంచి ఆర్టిస్టును తీసుకోవాలనే లక్ష్యంతోనే వరుణ్ తీసుకొన్నాం. వరుణ్ సత్తా, ప్రతిభను చూసే గని సినిమాను నిర్మించాం అని అలు బాబీ, సిద్దూ తెలిపారు.

    Recommended Video

    Puri Jagannath పంతం నెగ్గిచుకున్నాడు.. Vijay Devarakonda తో JGM | Filmibeat Telugu
    అల్లు అరవింగ్ మెంటర్‌గా

    అల్లు అరవింగ్ మెంటర్‌గా


    గని సినిమా వల్ల చాలా నేర్చుకొన్నాం. కొబ్బరికాయ కొట్టగానే కరోనావైరస్ కారణంగా సినిమా ఆగిపోయింది. ప్రొడక్షన్ విషయంలో నాకు జీరో నాలెడ్జ్. కానీ సిద్దూ నాకు అండగా నిలిచాడు. సిద్దూ మానసికంగా ధైర్యంగా నిలిచాడు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలను సిద్దూ చక్కగా డీల్ చేశాడు. దాంతో టెన్షన్ పెరుగలేదు. నాన్న గారు నాకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. మెంటర్‌గా మమ్మల్ని చాలా గైడ్ చేశారు. బడ్జెట్ పెరిగింది కానీ.. ఎంత పెరిగిందనే విషయాన్ని పట్టించుకోలేదు. కానీ మేము తీయాలనుకొన్నది మేము తీసాం. అదే మాకు సంతృప్తి అని అల్లు బాబీ, సిద్దూ తెలిపారు.

    English summary
    Varun Tej's Ghani movie set to release in Theatres. In this occassion, Allu Bobby and Siddhu Mudda has given interview for sports drama. They revealed interesting things to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X