For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రివిక్రమ్ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేశా.. వేణు తొట్టెంపూడి (Interview)

  |

  మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. యువ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సీఐ మురళి పాత్రలో కనిపించనున్నారు. రామారావు ఆన్ డ్యూటీ విడుదల నేపధ్యంలో విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆయన తన కెరీర్ గురించి, రామారావు ఆన్ డ్యూటీ సినిమా గురించి వేణు చెప్పిన విషయాలు ఏమిటంటే..

  Venu Tottempudi interview

  దమ్ము తర్వాత సినిమాలు చేయకపోవడానికి నిజానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. మాకు ఫ్యామిలీ బిజినెస్స్ చాలా వున్నాయి. బిజినెస్‌లో బిజీ అయిపోయా. సినిమాల గురించి ఆలోచించే తీరికే లేకుండాపోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని. అయితే కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలకు వెబ్ సీరిస్ చూడటం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి మళ్ళింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఇలాంటి సమయంలో రామారావు ఆన్ డ్యూటీ కథను దర్శకుడు శరత్ మండవ చెప్పారు. కథ అద్భుతంగా వుంది. సీఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారు. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా ఫస్ట్ టైమ్. రవితేజ లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది అని వేణు తొట్టంపూడి అన్నారు.

  సీఐ మురళి పాత్ర చేయడానికి కారణం ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. అలాగే రామారావు ఆన్ డ్యూటీ వైడ్ రీచ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే ఆసక్తితో ఈ సినిమా చేశా. అలాగే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ నాకు నేను డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి ఉండేది. కానీ రామారావు ఆన్ డ్యూటీలో నేనే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా. రామారావు ఆన్ డ్యూటీ తో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్‌ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మండవకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు అని వేణు తొట్టంపూడి అన్నారు.

  స్వయంవరంలో నాతో కలిసి చేయాలనీ రవితేజ చెప్పారనే విషయం గురించి అంతకుముందు నాకు తెలీయదండీ. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీతో మా కాంబినేషన్ కుదిరింది. మొదటి నుంచి నేను మల్టీ స్టారర్‌కు మొగ్గు చూపేవాడిని. చిరునవ్వుతో లాంటి సూపర్ హిట్ ఇచ్చినప్పటికీ వెంటనే హనుమాన్ జంక్షన్ చేశాను. చాలా మంది నటీనటులతో కలసి నటించడం అంటే అదొక పండగ. హనుమాన్ జంక్షన్ కూడా ఒక పండగలా గడిచింది వేణు తెలిపారు.

  నా చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు. ఆయన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర ఉంటే ఖచ్చితంగా చెప్తారు. అతడు సినిమాలో సోనూసూద్ పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోతే తర్వాత సోనుసూద్ చేశారు. ఈ పాత్రకి వేణు బావుంటాడని అనిపిస్తే తప్పకుండా చెప్తారు.

  రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్. డౌన్ టూ ఎర్త్ ఉంటారు. మంచి ఆహరం తినడం తప్ప మరో అలవాటు లేదు. శరీరాన్ని పాడుచేసే ఏ అలవాటు లేదు. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్ కు దూరంగా ఉంటాను.ఇక మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం అని అన్నారు.

  సినిమాలని కంటిన్యూ చేస్తాను. ఖచ్చితంగా సినిమాలని చేస్తా. అలాగే వెబ్ కంటెంట్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి ఉంది. ఛాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా చర్చల్లో ఉంది అని తెలిపారు.

  English summary
  Ramarao On Duty has impressed one and all with its theatrical trailer and Ramarao Mass Notice. Along with the usual mass entertainment expected from Ravi Teja's films, this time director Sarath also added a novel element of a thriller with a curious case of missing people in a village.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X