Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Vishal తో అలాంటి విభేదాలు.. ఆ కారణంగానే మా మధ్య చిచ్చు.. విష్ణు విశాల్
తమిళ హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్ RT టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్స్2పై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా హీరో విశాల్‌తో ఉన్న విభేదాలపై విష్ణు విశాల్ ఎలా స్పందించారంటే?

విశాల్‌తో రిలీజ్ డేట్ వివాదం గురించి
హీరో విశాల్ నాకు చాలా క్లోజ్. గతంలో మా మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే మా మధ్య ఎలాంటి విరోధం లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వద్ద ఇద్దరి సినిమాల రిలీజ్ ఒకే డేట్ కావడంతో మా మధ్య వాదనలు జరిగాయి. 2017లో నా సినిమా రిలీజ్ డేట్‌ను ముందే ప్రకటించాను. కౌన్సిల్ నియమాల ప్రకారం.. మూడు సినిమాల కంటే ఎక్కువగా రిలీజ్ చేయకూడదు.
కానీ ఐదు పెద్ద సినిమాల రిలీజ్‌కు అనుమతిచ్చారు. అయితే నా సినిమా రిలీజ్ ఆపమని అడిగారు. అయితే నేను నా సినిమా రిలీజ్‌కు ముందుగా అనుమతి ఇచ్చారు. నిర్మాతగా నేను ఎందుకు వెనక్కి తగ్గాలని రిలీజ్‌కే సిద్దపడ్డాను అని విష్ణు విశాల్ తెలిపారు.

తక్కువ స్కీన్లతో.. ఎక్కువ కలెక్షన్లు
విశాల్‌తో విభేదాల మధ్య 2017లో నా సినిమాను 120 స్క్రీన్లలో రిలీజ్ చేయగలిగాను. నా సినిమాకు మంచి డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. సాధారణంగా నా సినిమా 400 స్క్రీన్లలో రిలీజ్ చేసేవాడిని. ఆ సమయంలో విశాల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్‌గా ఉన్నాడు. అప్పట్లో పోటీపడి రిలీజ్ చేయడం వల్ల అందరికి ఇబ్బంది కలిగింది అని విష్ణు విశాల్ పేర్కొన్నారు.

విశాల్‌తో ఇప్పటికీ దూరంగానే..
రిలీజ్ డేట్ వివాదానికి ముందు విశాల్ నేను చాలా క్లోజ్. ఆ సమయంలో మ్యారేజ్ ఆగిపోయి విశాల్ టెన్షన్‌లో ఉన్నాడు. ఇంకా సినిమా రిలీజ్ టెన్షన్. అలాంటి పరిస్థితుల్లో మా మధ్య విభేదాలు పెద్దగా కనిపించాయి. ఆయన వ్యక్తిగత విషయాలు ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య పెద్దగా కమ్యూనికేషన్ లేదు. టచ్‌లో కూడా లేము అని విష్ణు విశాల్ అన్నాడు. మళ్లీ అదే డిసెంబర్.. అదే డైరెక్టర్‌తో మళ్లీ మట్టి కుస్తీ సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని విష్ణు విశాల్ తెలిపారు.

సీసీఎల్ వివాదం గురించి
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) జట్టు నుంచి కూడా నేను వైదొలిగాను. అక్కడ కూడా ఇగోల వల్ల విభేదాలు నెలకొన్నాయి. నేను స్వతహాగా క్రికెటర్‌ను. అయితే పెద్ద హీరోలే సీసీఎల్‌లో క్రికెట్ ఆడాలని చెప్పారు. అది నాకు నచ్చలేదు. నేనే విక్రాంత్ సీసీఎల్ నుంచి తప్పుకొన్నాం. విక్రాంత్ నేను లాల్ సలామ్‌లో కలిసి నటిస్తున్నాం అని విష్ణు విశాల్ తెలిపారు.

ఫస్ట్ క్రికెటర్.. ఆ తర్వాత యాక్టర్‌గా
నేను మొదట క్రికెటర్. తర్వాత యాక్టర్ అయ్యాను. ఈ రెండిట్లో ఏది ఇష్టమంటే చెప్పడం కష్టం. ప్రేమించిన అమ్మాయి ఇష్టమా? పెళ్లి చూసుకున్న అమ్మాయి ఇష్టమా ? అంటే ఏం చెప్తాం . క్రికెట్ ని ప్రేమించాను. సినిమాని పెళ్లి చేసుకున్నాను. రెండూ ఇష్టమే అని విష్ణు విశాల్ చెప్పారు.