Don't Miss!
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
జ్వాలా గుత్తాతో అలాంటి ప్రాబ్లెమ్స్.. కానీ తప్పుదు.. మ్యారేజ్ బ్రేకప్‌పై విష్ణు విశాల్ ఎమోషనల్
రాక్షసన్, అరణ్య, ఎఫ్ఐఆర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. ఇప్పుడు మట్టి కుస్తీతో మీ ముందుకు వస్తున్నా. ఎంటర్‌టైన్‌మెంట్, కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు. మా మట్టి కుస్తీ మూవీలో వినోదంతోపాటు మంచి కంటెంట్ ఉంది. ఏ హీరో, ఏ భాష అనేది చూడకుండా కంటెంట్‌ను మాత్రమే చూసి ఆదరించే తెలుగు ప్రేక్షకులపై నాకు ఎంతో గౌరవం ఉంది.
ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా అని విష్ణు విశాల్ అన్నారు. మట్టి కుస్తీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భార్య జ్వాలా గుత్తా గురించి విష్ణు విశాల్ మాట్లాడుతూ.

తెలుగింటి అల్లుడిని
నేను జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసిందే. నేను తెలుగింటి అల్లుడిని. నేను జ్వాలాని పెళ్లి చేసుకున్నాక తెలుగు సినిమాలు చేయమని జ్వాలా నన్ను హైదరాబాద్ కు తీసుకొచ్చింది. నా కెరీర్ లో అతిపెద్ద సినిమా 'మట్టి కుస్తీ'తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఇందుకు కారణమైన జ్వాలాకు, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన రవితేజ సర్ కు ధన్యవాదాలు.

జ్వాలాతో పెళ్లి తర్వాత
నా మొదటి పెళ్లి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయింది. కానీ జ్వాలాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా తెలుసుకొంటున్నాను. మన ప్రవర్తన చెడుగా ఉండకూడదని తెలుసుకొన్నాను. ప్రతీ ఒక్కరి జీవితంలో టెన్షన్ ఉంటుంది. ఎదుటి వారి ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకోవాలి, అంతేకాకుండా గౌరవించాలి. నా ఫ్రొఫెషన్ గురించి జ్వాలా అర్దం చేసుకోవడం చాలా హ్యాపీ. నేను నటుడినే కాదు.. నిర్మాతను కూడా. కాబట్టి నాకుండే ఒత్తిడులను అర్ధం చేసుకొని.. నాకు సపోర్టుగా నిలుస్తున్నది. ఒకరికొకరం అర్ధం చేసుకొంటూ ముందుకు వెళ్తున్నాం అని విష్ణు విశాల్ చెప్పారు.

భార్యభర్తలు మధ్య అభిప్రాయ బేధాలు
భార్యభర్తలు అంటే.. రకరకాల అభిప్రాయ బేధాలు ఉంటాయి. 40 దాంపత్య జీవితంలో మా అమ్మ, నాన్నలే కాదు.. ప్రతీ ఇంట్లో పెద్దలు గొడవలు పెట్టుకొంటారు. అయితే వాటిని పరిష్కరించుకోవడంలోనే సమస్యలు తీరిపోతాయి. నేను జ్వాలా గొడవ పడితే.. నేనే రాజీ పడుతాను. ప్రతీ ఇంటిలో మగాడే రాజీ పడితేనే సుఖం, సంతోషం ఉంటుంది. గొడవ జరిగినంత మాత్రాన బ్రేకప్ అంటే కుదరదు విష్ణు విశాల్ చమత్కరించారు.

జ్వాలా నటిస్తుందా?
జ్వాలా గుత్తా గతంలో ఒకటి అరా సినిమాల్లో నటించింది. అయితే ఆమెతో కలిసి నటించాలని ఉంది. కానీ ఆమెకు నటించడం ఇష్టం లేదు. ఓ సినిమాలో డ్యాన్స్ చేసింది. అది చేసినందుకు తప్పు చేశాననే ఫీలింగ్‌లో ఉంది. కానీ ఆమెకు సినిమాపై చాలా పట్టు ఉంది అని విష్ణు విశాల్ అన్నారు.

24 గంటలు సినిమాలే లోకం
మట్టి కుస్తీ సినిమా ఎడిటెడ్ వెర్షన్ చూసి.. చాలా సలహాలు ఇచ్చింది. అయితే మేము ఆలోచించని విధంగా ఆమె ఆలోచించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె 24 గంటలు సినిమాలే చూస్తుంది. నా సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటుంది. నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నది అని విష్ణు విశాల్ పేర్కొన్నారు.