For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్లీజ్.. నా మీద ఎటాక్ చేయొద్దు.. ఎన్నాళ్ళని తట్టుకుంటా ? విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు?

  |

  చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కుర్ర హీరో విశ్వక్ సేన్. అయితే ఆయన హీరోగా నటిస్తున్న పాగల్ సినిమా రేపు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ను ట్రోల్ చేసేలాగా చేస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి మీడియాతో ముచ్చటించారు విశ్వక్సేన్. ఈ సినిమా గురించి పలు కీలక విషయాలు వెల్లడించిన ఆయనఅలాగే రివ్యూలు రాసే వాళ్ల గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  ఆసక్తికర వ్యాఖ్యలు

  ఆసక్తికర వ్యాఖ్యలు


  దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా పాగల్. ఈ సినిమాలో హీరోగా విశ్వక్సేన్ నటిస్తుండగా హీరోయిన్ నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. అలాగే సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విశ్వక్సేన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమా కథ గురించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరికీ వెల్లడించిన విశ్వక్సేన్ మరోసారి సినిమా కథ పూర్తిగా చెప్పేశాడు.

  ఐదు నిమిషాల్లోనే

  ఐదు నిమిషాల్లోనే

  మొదటి ఐదు నిమిషాల్లోనే సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని ఒక చిన్న పిల్లాడికి తన తల్లి మాటలతో తన తల్లి అంత ప్రేమగా ప్రేమించేలా ఎవరు దొరుకుతారా అని అన్ కండిషనల్ లవ్ కోసం ఆ కుర్ర వాడు పెద్దవాడు అయ్యే వరకు వెతుకుతూనే ఉంటాడు అని చెప్పుకొచ్చారు. ఇక నేను నిజంగా చెబుతున్నాను అని చెప్పుకోచ్చిన విశ్వక్సేన్ ఈ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది అని ఖచ్చితంగా సినిమాని గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పాడు.

  రెండుమూడు రోజులు ఉండలేరు

  రెండుమూడు రోజులు ఉండలేరు

  సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చాక కూడా సినిమా గురించి రెండు మూడు రోజులపాటు మాట్లాడకుండా ఉండలేరు అని ఆ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని అన్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి అనే విషయం మీద స్పందిస్తూ అవును అక్కడ నేను చెప్పింది ఏ ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోనని రేపు రిలీజ్ అయ్యే వరకు ఇంకా 24 గంటలు ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఏమిటో మీరు కూడా చూస్తారు అని చెప్పుకొచ్చాడు.. నిన్న తన ఫ్రెండ్స్ కొంతమంది అలాగే దర్శకుడి ఫ్రెండ్స్ కొంతమంది సినిమా చూశారా అని చూసి బయటకు వచ్చే వాళ్ళంతా నువ్వు మళ్ళీ పేరు మార్చుకో అక్కర్లేదు గురు అలా ఉంది సినిమా అన్నారని చెప్పుకొచ్చాడు.

  అందుకే ఒత్తిడి

  అందుకే ఒత్తిడి

  ఇక తన సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే దిల్ రాజు మీద ఒత్తిడి తెచ్చి మరీ థియేటర్ రిలీజ్ చేయిస్తున్నారని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. అదీకాక నన్ను నమ్ముకుని డైరెక్టర్, డిఓపి హీరోయిన్ అందరూ వచ్చారని అందుకే ఈ సినిమాను ఒటీటీకి ఇవ్వలేకపోయానని అన్నారు. ఇది ఒక టీవీలో చూసే సినిమా కాదని నన్ను నేను టీవీలో చూస్సుకున్నా నచ్చడం లేదని అందుకే థియేటర్స్ లోనే రిలీజ్ చేయించాలని దిల్ రాజు మీద ఒత్తిడి తెచ్చి మరీ అడిగానని ఈ వ్యవహారం అంతా రేపు థియేటర్లో తెలిసిపోతుందని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు.

  ఫుల్ ఆఫ్ ఎమోషన్స్

  ఫుల్ ఆఫ్ ఎమోషన్స్

  ఇక ఫలక్నామా దాస్ హిట్ సినిమాలతో పోలిస్తే దీనిలో ఎమోషన్స్ తక్కువగా ఉన్నాయి అంటే లేదని ఈ సినిమాలో కూడా చాలా ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో ఎలా అయితే నవ్వకుండా ఉండలేరో సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో ఏడవకుండా ఉండలేరు అని చెప్పుకొచ్చాడు ముఖ్యంగా అమ్మాయిలు వెళితే ఖచ్చితంగా ఏడుస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లు చాలామంది కూడా ఈ విషయం చెప్పారని తన డ్రైవర్ తన మేనేజర్ వంటి వాళ్లు కూడా ఎప్పుడూ ఇంత ముందుకు వచ్చి మాట్లాడలేదని ఈ సినిమా చూసి నచ్చిన ఆనందంలో తన ముందుకు వచ్చి మాట్లాడారు అని చెప్పుకొచ్చాడు.

  నాకు భరించే శక్తి లేదు

  నాకు భరించే శక్తి లేదు

  ఇక క్రిటిక్స్ గురించి విశ్వక్సేన్ మాట్లాడుతూ వారి మాటలు కఠినంగా ఉండకూడదని విజ్ఞప్తి చేశాడు. సినిమా గురించి రాయండి కానీ మీరు దాడి చేస్తున్నట్లుగా రాయవద్దు అని కోరాడు. అలా చేస్తే భరించే శక్తి తనకు లేదని పేర్కొన్న విశ్వక్ నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని తన మామయ్య పెదనాన్న సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలుగా లేరని చెప్పుకొచ్చాడు. మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరన్న విశ్వక్సేన్ నాకు ఏదైనా జరిగితే నేను మాత్రమే నిలబడాలని చెప్పుకొచ్చారు. అంతేగాక నా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హాజరయ్యే ముందు కూడా జనాలు పది సార్లు ఆలోచిస్తారని కానీ కొందరే వస్తారు అని చెప్పుకొచ్చాడు.

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  నేను చెబితే మాత్రం వింటారా

  నేను చెబితే మాత్రం వింటారా

  అంతేకాక నా సినిమా ట్రైలర్ లేదా టీజర్ నచ్చినా ఎవరు ట్వీట్ చేయరని నా సినిమాల గురించి కూడా ఎవరు ట్వీట్ చేయరని చెప్పుకొచ్చాడు. ఇక ప్రసాద్ ఐమాక్స్ నిన్న పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది అన్న ఆయన నా సినిమా కనుక థియేటర్లకు మళ్ళీ జనాన్ని అనిపిస్తే అది చాలా సంతృప్తి ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఇక సినిమాలు ఎలా ఉంటే అలా రాయాలని తన పాత సినిమాలు ఈ నగరానికి ఏమైంది అలాగే ఫలక్నామా దాస్ సినిమాల విషయంలో మరీ 2 రేటింగ్ ఇచ్చారని ఆ సినిమాలు బాగానే ఉన్నా ఎందుకో తగ్గించి వేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ చెబుతున్నా మీరు రాసేదే రాస్తారని కాకపోతే నా ప్రయత్నంగా నేను చెబుతున్నానని విశ్వాస్ చెప్పుకొచ్చాడు.

  English summary
  Vishwak Sen‘s Paagal is releasing tomorrow. actor has emotionally pleaded support from the critics for his films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X