మర్డర్ కేసులో సూపర్ స్టార్ దర్శన్ అరెస్ట్.. కన్నడ ఇండస్ట్రీకి షాక్
కన్నడ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటన సంచలనం రేపింది. ఈ అరెస్ట్ వెనుక పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్నడ సినీ పరిశ్రమలో వివాదాస్పద నటుడిగా దర్శన్‌కు పేరుంది. ఇతర నటులతో సఖ్యత కూడా తక్కువే అని చెప్పుకొంటారు. అలాంటి స్టార్ హీరో తాజాగా చిత్ర దుర్గకు చెందిన రేణుక స్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కన్నడ సినీ పరిశ్రమలో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరున్న దర్శన్‌పై మంగళవారం మర్డర్ కేసు నమోదు అయింది. ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసిన ఆయనను వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆయనతోపాటు మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రేణుకు స్వామిని కామాక్షి పాల్య స్టేషన్ పరిధిలోని ఓ షెడ్‌లో హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని సున్నహల్లి బ్రిడ్డి వద్ద గుర్తించారు. ఈ ఘటనపై కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ హత్యతో దర్శన్‌కు సంబంధం ఉందని స్టార్ హీరోపై ఆరోపణలు వచ్చాయి. దాంతొ ఆయనను అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











