twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి.. సోషల్ మీడియాలో వెల్లడి.. అందుకే రాలేదని..

    |

    Recommended Video

    Actress Ex MP Ramya Was Suffering From Rare Disease | Filmibeat Telugu

    కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యా మరోసారి వివాదంలో కూరుకుపోయింది. మాజీ ఎంపీ, సీనియర్ నటుడు అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయగా, కన్నడలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే తనకు గురువు లాంటి అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడం వెనుక తన అనారోగ్యమే కారణమని పేర్కొన్నారు. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

    స్టార్ హీరోయిన్‌గా ఎదగడంపై

    స్టార్ హీరోయిన్‌గా ఎదగడంపై

    దివ్య స్పందన అనే అమ్మాయి కన్నడ చిత్ర పరిశ్రమలో రమ్యాగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో అంబరీష్ ఆశీర్వాదంతో ఎంపీ అయ్యారు. అలాంటి అంబరీష్ చివరిచూపుకు రాకపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. సోషల్‌ మీడియాల్లో వస్తున్న పోస్టులను చూసిన రమ్యా తన గైర్హాజరుకు సంబంధించి స్పష్టత ఇచ్చారు.

     అంబరీష్ అంత్యక్రియలకు రాకపోవడంపై

    అంబరీష్ అంత్యక్రియలకు రాకపోవడంపై

    కన్నడ ప్రముఖ సినీ నటుడు అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి కారణాన్ని తన సోషల్ మీడియాలో వెల్లడించింది. నా కాలికి అరుదైన వ్యాధి సోకింది. నేను రాకపోవడాన్ని తప్పుపట్టి నిరసన వ్యక్తం చేయవద్దు. అంబరీశ్‌ అంకుల్‌ మృతితో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను అని రమ్యా పేర్కొన్నది.

    ఔను..! నాపెళ్ళి నిజమే: స్వయంగా ఇలా చెప్పేసిందిఔను..! నాపెళ్ళి నిజమే: స్వయంగా ఇలా చెప్పేసింది

     అంబరీష్ మరణం కుంగదీసింది

    అంబరీష్ మరణం కుంగదీసింది

    అంబరీష్ అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి నన్ను చాలా కుంగ దీసింది. అందుకే అంత్యక్రియలకు రాలేదు. వ్యక్తిగతంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో బాధపడుతున్నాను అని ఎంపీ రమ్యా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఫోటో, సందేశాన్ని పోస్టు చేశారు.

     ఆస్టియోకాల్‌యటోమా అరుదైన వ్యాధితో

    ఆస్టియోకాల్‌యటోమా అరుదైన వ్యాధితో

    ప్రాథమిక సమాచారం ప్రకారం.. రమ్యా ఆస్టియోకాల్‌యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. కాలులోని మూలగకు సంబంధించిన వ్యాధి అని వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారట. దాంతో అక్టోబర్‌ నుంచి రమ్యా చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకొంటున్నారు.

    పదిలక్షల మందిలో ఒకరికి

    పదిలక్షల మందిలో ఒకరికి

    ఆస్టియోకాల్‌యటోమా అనేది అరుదైన వ్యాధి పది లక్షల మందిలో ఒక్కరికి వస్తుందని వైద్యులు వెల్లడించారు. ఎముక ములగుల్లో బాధ విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాధితో నడిచేందుకు సాధ్యం కాదు. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఆపరేషన్‌ తప్పదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యాధికే కి మాజీ ఎంపీ రమ్య గురికావడం గమనార్హం.

    English summary
    Ex MP Ramya was suffering with rare decease. She told that Because of ill health, I could not attended late ambareesh funeral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X