»   »  వివాహేతర సంబంధం, ఆపై దాడి: భర్తపై ఫిర్యాదు చేసిన హీరోయిన్

వివాహేతర సంబంధం, ఆపై దాడి: భర్తపై ఫిర్యాదు చేసిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని హీరోయిన్ ఫిర్యాదు

కన్నడలో ఖుషి, శిష్యా లాంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ చైత్రా తన భర్తపై బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా, మానిసికంగా హింసిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

 నెల రోజులుగా వేధింపులు

నెల రోజులుగా వేధింపులు

2006లో లిక్కర్ వ్యాపారి, రియల్టర్ అయిన బాలాజీ పోతరాజ్‌తో తనకు వివాహం జరిగిందని, గత నెల రోజులుగా తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చైత్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రక్తం వచ్చేలా దాడి చేశాడు

రక్తం వచ్చేలా దాడి చేశాడు

ఈనెల 14న చిన్న విషయానికి గొడవపడి తీవ్రంగా దాడి చేశాడు. నోరు, ముక్క భాగాలు నుండి రక్తం కారేలా తలను గోడకేసిన కొట్టాడు. గొంతు పట్టుకుని పొట్ట, పలు చోట్ల తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడితో తాను స్పృహ కోల్పోయాను అని ఆమె తెలిపారు.

ఆమెతో వివాహేతర సంబంధం

ఆమెతో వివాహేతర సంబంధం

అమూల్య అనే యువతితో నా భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, అడ్డుగా ఉన్న తనను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, తనను హత్య చేయాలనుకున్నాడు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రస్తుతం తాను పుట్టింట్లో ఆశ్రయం పొందుతున్నాను. తనపై దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసించిన బాలాజీ పోతరాజ్ మీద చట్టపరంగా కఠని చర్యలు తీసుకోవాలని చైతన్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చైత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Kannada Actress Chaitra Poth Raj, who has acted in Kannada Films such as Kushi and Shishya is planning to divorce. She has filed a dowry harassment case against her husband Balaji Pothraj at Basavugudi Women's Police Station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X