For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వికటించిన సర్జరీ.. అందమైన హీరోయిన్ పరిస్థితి దారుణంగా.. ముఖం గుర్తుపట్టలేనంత భయంకరంగా!

  |

  Kannadaసినిమా ప్రపంచంలో నటిమణులు అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ కొందరు ఉన్న అందంతో సంతృప్తి చెందక అనవసరంగా సర్జరీలకు వెళ్లి ఉన్న మొహాన్ని మొత్తం పాడుచేసుకుంటున్నారు. గతంలో సర్జరీలు వికటించి తీవ్ర మనస్తాపానికి లోనై ఇండస్ట్రీలకు దూరమైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇటీవల ఒక కన్నడ నటి మాత్రం ఎక్కువగా మొహాన్ని మార్చకుండా ఒక చిన్న పంటి సమస్య కోసం చిన్న సర్జరీ చేయించుకునేందుకు వెళితే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్జరీ వికటించి ముఖం గుర్యుపట్టలేనంతగా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  సినిమాలతోనే కాకుండా..

  సినిమాలతోనే కాకుండా..

  బెంగళూరుకి చెందిన కన్నడ హీరోయిన్ స్వాతి కొన్ని చిన్న సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఎఫ్ఐఆర్, 6టు6 అనే కొన్ని విభిన్నమైన సినిమాలతో కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది. కేవలం సినిమాలలోనే కాకుండా బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్ ద్వారా ఆమెకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఒక వైపు సినిమాలు మరో వైపు బుల్లితెరపై రాణిస్తున్న ఆమె ఇంత కాలం పాటు చాలా బిజీ గా కనిపించింది.

  గుర్తు పట్టలేని విధంగా

  గుర్తు పట్టలేని విధంగా

  అయితే హఠాత్తుగా స్వాతి ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏ మాత్రం గుర్తుపట్టలేని విధంగా స్వాతి ముఖం మారిపోవడం కన్నడ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. అసలు ఆమెకు ఏమి జరిగింది అని సన్నిహితులు కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇక ఆ తరువాత స్వాతి సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో తనకు జరిగిన విషయం గురించి చెప్పింది.

  డాక్టర్ సలహాతో

  డాక్టర్ సలహాతో

  గత కొన్ని నెలలుగా స్వాతి పంటి నొప్పితో బాధపడుతూ ఉండడంతో వెంటనే దాని నుంచి కోలుకోవడానికి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లోనే వైద్యుడిని సంప్రదించింది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావడంతో ఆమె డాక్టర్ చెప్పినట్లుగా రూట్ కెనాల్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది అని చెప్పడంతో పెద్దగా ఆలోచించకుండానే స్వాతి అందుకు ఒప్పుకుంది. ఖర్చు విషయంలో కూడా ఆమె ఏమాత్రం వెనకడుగు వేయలేదు.

  మరుసటి రోజు..

  మరుసటి రోజు..

  రూట్ కెనాల్ సర్జరీ చేసిన తర్వాత ఆమె ముఖం కొన్ని గంటల లోపు ఊహించని విధంగా మారిపోయిందట. తీవ్రమైన నొప్పితో ఒక రాత్రి మొత్తం నిద్ర పోయిన ఆమె మరుసటి రోజు చూసుకునేసరికి ఊహించని విధంగా మారిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిందట. ముఖంతో పాటు పేదలు కూడా విపరీతంగా వాచి పోయాయి. ఇక ఆ విషయం గురించి వెంటనే సదరు వైద్యుడికి తెలియజేయగా అది సాధారణంగా వచ్చే వాపు అనే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది అని తెలియజేశారు.

   న్యాయ పోరాటానికి సిద్ధం

  న్యాయ పోరాటానికి సిద్ధం

  అయితే 20 రోజులు గడిచినా కూడా వాపు తగ్గకపోవడంతో బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మళ్ళీ ఆమె మరో మల్టీస్పెషల్టి హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోగా తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే ముఖం వాచిపోయింది అని తెలిసింది. దీంతో హీరోయిన్ వెంటనే తనకు సర్జరీ చేసిన డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై విరుచుకుపడింది. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ వాపు తగ్గిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు ఆసుపత్రి పై కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

  English summary
  actress swathi sathish shocking looks after her root canal surgery goes wrong
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X