బతికి ఉండగానే చర్మం ఒలిచినట్టు.. దర్శన్, పవిత్రలు అకృత్యాలు..రేణుకస్వామి కేసులో సంచలనాలు
సినీ అభిమాని రేణుకస్వామి హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతోపాటు మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న దర్శన్, పవిత్ర, ఇతరులను విచారించగా వారి చేసిన అకృత్యాలు బయటపడ్డాయి. వాటి వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన దర్శన్ అభిమాని రేణుకస్వామి కొద్ది రోజుల క్రితం సినీ నటి, ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. చాలాకాలంగా పవిత్రతో అఫైర్ ఉన్న దర్శన్ తీవ్రంగా పరిగణించి.. తన అనుచరులతో అతడిని కిడ్నాప్ చేశారు. దారుణంగా కొట్టడంతో చనిపోయాడు. ఆ తర్వాత అతడి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు.

రేణుకస్వామి అదృశ్యం కావడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు ఈ కేసు తీగ లాగగా డొంక పూర్తిగా కదిలింది. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేసి విచారించగా.. దర్శన్, పవిత్ర పేర్లు బయటకు వచ్చాయి. ఆ వ్యవహారంలో వారిని అరెస్ట్ చేసి విచారిస్తుండగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
రేణుకస్వామిని తీసుకొచ్చి దారుణంగా హింసించారు. శాఖాహారం తీసుకొనే అతడి నోట్లో మాంసం ఎముక పెట్టి కొట్టారు. మాంసం తింటే నీకు దెబ్బలను ఓర్చుకొనే శక్తి వస్తుందని శారీరకంగా హింసించారు. చర్మం చిట్లిపోయి ఊడిపోయే విధంగా కొట్టారు. దాంతో అతడు మరణించాడు అనే విషయం విచారణలో వెలుగు చూసింది.

ఇలాంటి దారుణమైన సంఘటనకు బాధ్యుడైన దర్శన్, పవిత్రగౌడ, ఇతరలను ఏ మాత్రం వదిలిపెట్టకూడదు. సభ్య సమాజం తలవంచుకొనేలా వ్యహరించిన వారిని కఠినంగా శిక్షించాలని పబ్లిక్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రేణుకస్వామి భార్య ప్రస్తుతం గర్బిణి. తన భర్త మరణంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నామని మీడియాకు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











