twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sanchari Vijay యాక్సిడెంట్.. స్నేహితుడి మీద కేసు.. 2 ఏళ్ల వరకూ జైలు శిక్ష?

    |

    తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో ఒక విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కన్నడ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సంచారి విజయ్ బ్రెయిన్ డెడ్ కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

    యాక్సిడెంట్ కావడంతో

    యాక్సిడెంట్ కావడంతో

    జూన్ 12వ తేదీ రాత్రి సమయంలో విజయ్ తన స్నేహితుడు నవీన్ తో కలిసి బైక్ మీద వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి పదిన్నర గంటల సమయంలో బెంగళూరు జేపీ నగర్ లోని సెవెన్ ఫేస్ l&t సౌత్ సిటీ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కారణంగా యాక్సిడెంట్ అయింది. అప్పటికప్పుడు ఆయనను అపోలో హాస్పిటల్ కు తీసుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

     కుడికాలికి, తలకు బలమైన గాయాలు

    కుడికాలికి, తలకు బలమైన గాయాలు

    ఈ ప్రమాదంలో సంచారి విజయ్ కుడికాలికి, తలకు బలమైన గాయాలు తగిలాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స కూడా చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.. బ్రెయిన్ డెడ్ గా ఉన్న పరిస్థితుల్లో ఆయన అవయవాలు దానం చేయడానికి కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు.

    స్నేహితుడే కారణం

    స్నేహితుడే కారణం

    అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నేపధ్యంలో ఈ ప్రమాదానికి విజయ్ స్నేహితుడు నవీన్ కారణమైనట్టు గుర్తించి ఆయన మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం.. నవీన్ బండి నడుపుతున్న సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ నేపధ్యంలోనే ఆయన మీద కేసు నమోదు చేసినట్టు సమాచారం.

    రెండేళ్ల వరకు జైలు శిక్ష

    రెండేళ్ల వరకు జైలు శిక్ష

    దీంతో ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాక ఒక వ్యక్తి మృతి చెందడానికి కారణం అయ్యాడు కాబట్టి నవీన్ మీద ఐపీసీ 279, 338 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసులు గనక కోర్టులో ప్రూవ్ అయితే ఆయనకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. అలాగే జరిమానా కూడా విధించవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.

    Recommended Video

    Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
    హిజ్రా పాత్రకు

    హిజ్రా పాత్రకు


    ఇక 2011లో 'రంగప్ప హోగ్బట్నా' సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంచారి విజయ్‌ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక కన్నడ సినిమాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాక ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. 2015లో ఆయన 'అవనల్ల అవళు' సినిమాలో హిజ్రాగా నటించి మెప్పించారు. ఆ హిజ్రా పాత్రకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం లభించింది. ఇక విజయ్ కన్నడ సినిమాలకే పరిమితం కాక తమిళంలో కూడా సినిమాలు చేశారు.

    English summary
    FIR has been registered against Naveen, Sanchari Vijay’s friend who rode the bike on June 12. case has been registered against Naveen under IPC section 279 and IPC section 338 punishable with imprisonment of either description for a term which may extend up to two years or with fine which may extend to one thousand rupees or with both.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X