Don't Miss!
- News
Sajjala : కోటంరెడ్డి టీడీపీలోకే ? తేల్చేసిన సజ్జల- ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు !
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు.. మొదట్లోనే బిగ్ బడ్జెట్!
సినిమా ప్రపంచంలో ప్రముఖుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. అంతేకాకుండా ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల కుమారులు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు అదే బాటలో వ్యాపారవేత్తలు వారసులు కూడా హీరోగా ఎంట్రీ చేస్తుండడం విశేషం. ఇక దేశమంతా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న వ్యాపారవేత్తలలో ఒకరైన గాలి జనార్దన్ రెడ్డి కూడా తన కుమారుడిని చిత్ర పరిశ్రమలోకి తీసుకురాబోతున్నారు. అనేక అంశాలతో దేశమంతా ఒకప్పుడు హాట్ టాపిక్ గా నిలిచిన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం భారత జనతా పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి కేవలం వ్యాపారాలతోనే తోనే కాకుండా రెగ్యులర్గా పాలిటిక్స్ లో కూడా పాల్గొంటున్నారు.
ఇక ఇప్పటికే కర్ణాటకలో చాలామంది రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే మరికొంతమంది నేతలు కుమారులు కూడా రెగ్యులర్ గా సినిమా ఇండస్ట్రీ లో బిజీ గా మారుతున్నారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి తన కుమారుడిని సినిమాల్లోకి తీసుకు వస్తున్నారు. అయితే ఇది ఆయన ఆలోచన కాదని తన కొడుకు కిరీరి ఎంతో ఇష్టంగా ఒక ఫ్యాషన్ తోనే చిత్ర పరిశ్రమలోకి హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు తెలుస్తోంది.

గత ఏడాది నుంచి కిరీటి హీరోగా ఇవ్వడానికి చాలా శిక్షణ తీసుకున్నట్లుగా సమాచారం. డాన్స్ అలాగే నటనపై ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుని పూర్తిగా సిద్ధమైన తర్వాతనే వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గాలి జనార్దన్ తనయుడు కిరీటి హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మీడియాలో కూడా ఈ వార్త వైరల్ గా మారుతోంది. ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకున్న ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ ఈ హీరో మొదటి సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన రాధాకృష్ణ ఎంతో ప్యాషన్ తో కిరీటి చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని అతను గత ఏడాది నుంచే నటనలో అలాగే డాన్స్ యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అని కిరీటికి మంచి నటుడిగా భవిష్యత్తు ఉంది అని కూడా వివరణ ఇచ్చారు.
ఈ దర్శకుడు ఇదివరకే కన్నడలో 'మాయాబజార్' అనే సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 'జాకీ' మూవీ ప్రేరణతోనే కిరీటి ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇక భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలను కూడా ప్రొత్సహించే ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, కిరీటి మొదటి చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగులో కూడా సాయి కొర్రపాటి మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన సలహతోనే కిరీటి మొదటి సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం.