Don't Miss!
- News
బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
Happy Birthday Shivaraj Kumar ట్రెండింగ్‌గా ఘోస్ట్ ఫస్ట్ లుక్
కన్నడ ప్రజలు ఎంతో అభిమానించే స్టార్ హీరో, కరుణాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ఘోస్ట్. పలు భాషలకు సంబంధించిన నటులు కలయికతో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందింది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కింది. కన్నడ బ్లాక్ బస్టర్ బీర్బల్ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాజకీయ నేత, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఘోస్ట్ చిత్రం ఆసక్తికరంగా యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్నది.
కింగ్ ఆఫ్ ఆల్ మాసెస్ డాక్టర్ శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా, అంటే జులై 12వ తేదీన శాండల్ ఉడ్ బాద్షా కిచ్చా సుదీప ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పోస్టర్ డిజైన్ సినిమాపై ఆసక్తి మరింత పెంచేలా ఉంది. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ ఇది యాక్షన్ చిత్రమని చెప్పకనే చెప్పింది. సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్ వీటితో డిజైన్ చేసిన పోస్టర్ డిటైలింగ్ చాలా బాగుంది. ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.

ఘోస్ట్ చిత్రంతో టాప్ టెక్నిషియన్ భాగమయ్యారు. కన్నడలో బ్లాక్ బస్టర్స్ తగరు, సలగ చిత్రాలకు మాటలందించిన మస్తీ, బీర్బల్‌కు సంభాషణలు అందించిన ప్రసన్న వీఎం కి డైలాగ్స్ రాస్తున్నారు. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఐరావత, హతవాది, మణ్ణిన ధోని, అసుర లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాతభారీ స్థాయిలో నిర్మాత సందేశ్ నాగరాజ్ ఘోస్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్ట్ చివరి వారంలో ఘోస్ట్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ప్రొడక్షన్:
సందేశ్
ప్రొడక్షన్స్
(29వ
చిత్రం)
డైరెక్టర్:
శ్రీని
(బీర్బల్)
కెమెరామెన్:
మహేంద్ర
సింహ
సంగీతం:
అర్జున్
జన్య
ఆర్ట్:
శివ
కుమార్
(కె
జి
ఎఫ్)
డైలాగ్స్:
మస్తీ,
ప్రసన్న
వి
ఎం
పబ్లిసిటీ:
బిఏ
రాజు'స్
టీం