Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కిడ్నాప్ కేసులో కన్నడ హీరో దునియా విజయ్ అరెస్ట్!

కన్నడ నటుడు దునియా విజయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. జిమ్ ట్రైనర్‌ను కిడ్నాప్ చేసిన వేధింపులకు గురి చేసిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశాడు. జిమ్ ట్రైనర్, పాని పూరి కిట్టి మేనల్లుడు మారుతి గౌడను విజయ్ కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేయడం వల్లే అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.
బెంగుళూరులోని వసంత నగర్‍లోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం సాంయత్రం జరిగిన 'మిస్టర్ బెంగుళూరు బాడీ బిల్డర్' కాంపిటీషన్లో మారుతి గౌడ పాల్గొనాల్సి ఉండగా దునియా విజయ్, అతడి గ్యాంగ్ మారుతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసి కారులో తీసుకెళుతూ అతడిపై దాడి చేసినట్లు సైతం కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి.

ఆసుపత్రిలో జిమ్ ట్రైనర్
విజయ్, అతడి గ్యాంగ్ వేధింపుల వలన మారుతి గౌడ తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం వికాస్ గౌడ బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేడని తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు
తన మేనల్లుడి మీద దాడి జరిగిందనే విషయం తెలిసిన వెంటనే పాని పూరి కిట్టి అలియాస్ కృష్ణ మూర్తి..... హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విజయ్‌కు వ్యతిరేకంగా శనివారం రాత్రి 11.30 గంటలకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే విజయ్‌కు కాల్ చేసి అతడికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే వదిలేయాలని వార్నింగ్ ఇచ్చారు.

పోలీసుల ముందే గొడవ
పోలీసుల నుండి కాల్ వెళ్లిన 30 నిమిషాల్లో విజయ్ మారుతి గౌడను తీసుకుని పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల ముందే విజయ్, పాని పూరి కిట్టి గొడవపడినట్లు తెలుస్తోంది. విజయ్ అతడి మీద చేయిచేసుకోవడానికి ప్రయత్నించగా మధ్యలో కల్పించుకున్న ఏసీపీ అతడిని తీవ్రంగా హెచ్చరించనట్లు తెలుస్తోంది.

విజయ్ మీద కేసు నమోదు
పోలీసులు వార్నింగుతో విజయ్ తగ్గాడని తెలుస్తోంది. అనంతరం విజయ్‌పై ఐపీసి సెక్షన్ 365(కిడ్నాపింగ్), 342, 325, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. ఒక సినిమా హీరో ఇలాంటి చర్యలకు పాల్పడటం బెంగుళూరు చర్చనీయాంశం అయింది. అరెస్ట్ అనంతరం విజయ్‌ను 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపించారు.