Don't Miss!
- News
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ బిగ్ స్కెచ్- ఏపీ సహా: 12 రోజుల పాటు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండును పెళ్లాడిన ప్రముఖ నటుడు
పుట్టా గౌరి అనే కన్నడ టీవీ సోప్‌లో మహేశా పాత్రతో పాపులర్ అయిన నటుడు రక్ష్ తన ప్రియురాలు అనూషను ఆదివారం(మే 26) పెళ్లాడారు. బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లోని శీష్ మహల్‌లో వీరి వివాహ వేడుక వైభవంగా సాగింది.
హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో నూతన వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసిపోయారు. వధువు పింక్ షేడ్స్ ఉన్న రెండ్ సారీ ధరించి ట్రెడిషనల్ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుడు రక్ష్ సిల్క్ వెస్తి, ధోతి ధరించాడు. వివాహం అనంతరం జరిగిన రిసెప్షన్లో పలురువు స్టార్లు సందడి చేశారు.

ఈ వివాహ వేడుకకు టీవీ పరిశ్రమ నుంచి అనుపమ గౌడ, క్రిష్ తాపండ తదితరులు హాజరయ్యారు. పుట్ట గౌరీ ఫేం రంజని రాఘవన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశారు.
అనూష తిప్తూరుకు చెందిన అమ్మాయి. రక్ష్, అనూష మధ్య దాదాపు 12 సంవత్సారల నుంచి పరిచయం ఉంది. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. రక్ష్ అసలు పేరు రక్షిత్ శెట్టి. అప్పటికే ఆ పేరుతో ఇండస్ట్రీలో ఒక స్టార్ ఉండటంతో తన నేమ్ ఇలా మార్చుకున్నాడు. ప్రస్తుతం రక్ష్ జీ కన్నడలో ప్రసారం అవుతున్న గట్టిమేలలో నటిస్తున్నాడు.