11 ఏళ్ల తర్వాత తేలిన కేసు: లేడీ నిర్మాత అరెస్ట్, జైలు శిక్ష
కన్నడ నిర్మాత జయశ్రీ దేవి చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలారు. దీంతో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కర్నాటక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 11 సంవత్సరాల క్రితంనాటి ఈ కేసులో ఆమెకు ఇప్పుడు శిక్ష పడింది. అయితే ఈ కేసులో ఆమెకు బెయిల్ కూడా లభించింది.

2007లో ఆనంద్ అనే మరో సినీ నిర్మాత జయశ్రీ మీద కేసు వేశారు. ఆమె తరకు ఇచ్చిన రూ. 34 లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కావడంతో చీటింగ్ కేసు పెట్టారు. జయశ్రీ కన్నడలో 'శ్రీ మంజునాథ', 'అమృత వర్షిణి' లాంటి హిట్ చిత్రాలు నిర్మించారు.

2007లో ఓ సినిమా నిర్మాణం కోసం జయశ్రీ దేవికి ఆనంద్ రూ. 60 లక్షలు ఇచ్చారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో జయశ్రీ అతడికి రూ. 15 లక్షల క్యాష్ ఇవ్వడంతో పాటు మిగతా మొత్తానికి చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో ఆనంద్ అదే సంవత్సరం చామరాజ్‌పేట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.


Click it and Unblock the Notifications











