Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కన్నడ రెబల్‌స్టార్ అంబరీష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి.. శోకసంద్రంలో నటి సుమలత
కన్నడ సూపర్‌స్టార్, రెబల్ స్టార్ అంబరీష్ ఇక లేరు. శనివారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ విక్రమ్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ తెలుగు, కన్నడ నటి సుమలతకు భర్త అనే సంగతి తెలిసిందే. తాము ముద్దుగా పిలుచుకొనే అంబి ఇక లేరనే వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

అంబరీష్ అసలు పేరు
అంబరీష్ అసలు పేరు మలవల్లి హుచ్చే గౌడ అమర్‌నాథ్. మైసూర్ స్టేట్‌లోని మాండ్యలో 1952 మే 29న జన్మించారు. వయసు 66 సంవత్సరాలు. మాండ్య, మైసూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. అంబరీష్‌కు అభిషేక్ అంబరీష్ అనే కుమారుడు ఉన్నాడు.

అంబరీష్ కెరీర్
అంబరీష్ నాగరహావు అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత జలీలా అనే సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించారు. ఇప్పటి వరకు ఆయన 200 చిత్రాలకు పైగా నటించారు. అంబరీష్ చివరి చిత్రం అంబీ నింగ్ వయాస్సేథో. తన చివరి చిత్రంతో కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండించారు.

విష్ణువర్ధన్ అత్యంత స్నేహితుడు.
అంబరీష్‌కు కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్ అత్యంత స్నేహితుడు. వారి ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఇప్పటి వరకు చూడలేదు అని అంబరీష్ భార్య, నటి సుమలత సమయం దొరికినప్పుడల్లా చెప్పుతారు. మెగాస్టార్ చిరంజీవితో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

నటనకు స్వస్తి
నటనకు స్వస్తి చెప్పిన ఆయన కన్నడ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించారు. కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారు. కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేయాలని కోరినప్పుడు సున్నితంగా తిరస్కరించారు.

కావేరి జలాల విషయంలో
1998 నుంచి 2009 వరకు లోకసభ సభ్యుడిగా కొనసాగారు. 2006 నుంచి 2008 వరకు కేంద్రమంత్రి వర్గంలో సమాచారశాఖామంత్రిగా కొనసాగారు. కావేరి జలాల విషయంలో తన పదవికి రాజీనామా చేశారు.

కన్నడ సినీ నటుల శ్రద్ధాంజలి
అంబరీష్ మృతితో కన్నడ సినీ తారలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హాస్పిటల్‌లో ఆయన మృతదేహానికి సినీ తారలు పునీత్ రాజ్ కుమార్, దునియా విజయ్, ఇతర కన్నడ నటులు శ్రద్ధాంజలి ఘటించారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ సంతాపం
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. గొప్ప మనసున్న వ్యక్తి, నా స్నేహితుడు నాకు దూరమయ్యాడు. ఇక ముందు నీవు లేవన్న విషయంతో దు:ఖంలో మునిగిపోయాను. నీ ఆత్మకు శాంతి కలుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని రజనీ ట్వీట్ చేశారు.