సింగర్ సుస్మిత సూసైడ్: చనిపోయినా మానవత్వం చాటుతూ.. షాకింగ్ నిర్ణయం

కన్నడ సింగర్ సుస్మిత ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఆదివారం రాత్రి తన తల్లిదండ్రుల ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని మరణించడం దక్షిణాది చిత్రసీమలో కలకలం రేపింది. వరకట్నం వేధింపులతో తన ప్రాణాలను తీసుకోవడం సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టింది. అయితే మరణాంతరం ఆమె చూపిన మానవత్వానికి అభిమానులు జేజేలు పలుకుతున్నారు.. ఇంతకు ఆమె తీసుకొన్న నిర్ణయం ఏమిటంటే..

గాన ప్రతిభతో సుస్థిర స్థానం

గాన ప్రతిభతో సుస్థిర స్థానం

26 సంవత్సరాల సుస్మిత జీవితం అర్ధాంతరంగా ముగియడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారనేది వాస్తవం. శ్రీ శ్రమణ్య, హలుతప్ప లాంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం ఏర్పరుచుకొన ఈ గాయని సూసైడ్ నిర్ణయంతో అందరికి షాకిచ్చారు. ఆమె మరణించారనే వార్తను ఇంకా స్నేహితులు, సన్నిహితులు నమ్మలేకపోతున్నారని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకొంటూ బాధను పంచుకొంటున్నారు.

కట్నం కోసం టార్చర్

కట్నం కోసం టార్చర్

తన కూతురు భవిష్యత్ బాగుండాలని పెళ్లి సమయంలో 150 గ్రాముల బంగారం ఇచ్చాం. నా కూతురు కోసం తమ సొంత ఇంటిని అమ్మాల్సి వచ్చింది. అలాగే పెళ్లి జరిపించడానికి రూ.20 లక్షల వరకు లోన్ తీసుకొన్నాం. ఇంత చేసినా మా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడం దారుణం అని సింగర్ సుస్మిత తల్లి మీనాక్షి కన్నీటీ పర్యంతమవుతున్నారు.

నా చావుకు కారణమైన వారిని దారుణంగా శిక్షించాలి

నా చావుకు కారణమైన వారిని దారుణంగా శిక్షించాలి

అమ్మా.. నన్ను క్షమించండి.. తన తల్లి గీత చెప్పుడు మాటలు విని శరత్ కుమార్ నన్ను తీవ్రంగా వేధించారు. నేను చేసిన కొన్ని తప్పులకే శిక్ష విధించుకొంటున్నాను. నా అత్తగీత, శరత్ నా మరణానికి కారణం. నేను ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణమైన వారిని దారుణంగా శిక్షించాలి. నా మరణం తర్వాత కేఆర్ పేటే‌లోని శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపించండి. తమ్ముడు సచిన్‌ను జాగ్రత్తగా చూసుకోమని మెసేజ్ రాసింది అని తల్లి మీనాక్షి మీడియాకు వెల్లడించారు.

Recommended Video

Kannada Star Yash Breaksdown Looking At His Daughter || Telugu
కళ్లను దానం చేసిన సింగర్

కళ్లను దానం చేసిన సింగర్

అయితే మరణాంతరం సుస్మిత చూపిన మానవత్వంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. నా మరణం తర్వాత నా కళ్లను ఇతరకు దానం చేయాలని తన తల్లిదండ్రులకు సూచించాలి. నేను లేకున్నా నా వల్ల మరొకరికి మంచి జరగాలని సుస్మిత కోరుకోవడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X