»   »  చిరంజీవీ సర్జా, మేఘన రాజ్‌ మళ్లీ పెళ్లి.. ఈ సారి అర్జున్‌ ఆశీస్సులతో (ఫొటోలు)

చిరంజీవీ సర్జా, మేఘన రాజ్‌ మళ్లీ పెళ్లి.. ఈ సారి అర్జున్‌ ఆశీస్సులతో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ తారలు చిరంజీవీ సర్జా, మేఘన రాజ్‌ మరోసారి పెళ్లి చేసుకొన్నారు. బెంగళూరులో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం చిరంజీవి, మేఘన మ్యారేజ్ క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో ఓ చర్చిలో జరిగిన విషయం తెలిసిందే.

ఇద్దరి మధ్య పదేళ్ల బంధం

ఇద్దరి మధ్య పదేళ్ల బంధం

మేఘనరాజ్, చిరంజీవి సర్జా మధ్య పదేళ్ల బంధం ఉంది. గతంలో స్నేహితులుగా ఉన్న వీరు.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

పెద్దల అంగీకారంతో పెళ్లి

పెద్దల అంగీకారంతో పెళ్లి

మేఘనతో పెళ్లి గురించి చిరంజీవి సర్జా మాట్లాడుతూ.. మేమిద్దరు చాలా కాలంగా ఫ్రెండ్స్‌గా ఉన్నాం. మా స్నేహం ప్రేమగా మారింది. అందుకే పెళ్లి చేసుకొన్నాం. మేఘనను పెళ్లి చేసుకోవడం గొప్ప అనుభూతి. మా పెళ్లికి పెద్దల ఆశీర్వాదం ఉంది అని అన్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు

కన్నడ సినీ పరిశ్రమలో అర్జున్ సర్జా పేరున్న నటుడు. దండం, దశగుణం, విజిల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక మేఘన రాజ్ కన్నడ, మలయాళ, తమిళ రంగంలో పలు చిత్రాల్లో నటించారు.

అర్జున్ చేతుల మీదుగా పెళ్లి

అర్జున్ చేతుల మీదుగా పెళ్లి

చిరంజీవి సర్జా ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. పెళ్లి వేడుకను అర్జున్ దగ్గరుండి చూసుకొన్నారు. అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్యలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల రిలీజైన లై చిత్రంలో కూడా విలన్‌గా నటించారు. మాపల్లెలో గోపాలుడు చిత్రం ద్వారా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు.

నాగచైతన్య, సమంత మాదిరిగానే..

నాగచైతన్య, సమంత మాదిరిగానే..

గతేడాది టాలీవుడ్ తారలు నాగచైతన్య, సమంత ఈ విధంగానే గోవాలో పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. తొలుత క్రిస్టియన్ పద్దతిలో మ్యారేజ్ చేసుకొన్న తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి సమంతను నాగచైతన్య వివాహం చేసుకొన్నారు.

English summary
Kannada actors Chiranjeevi Sarja and Meghana Raj recently tied the knot in a grand Hindu wedding in Bengaluru. Initially, the couple got married in a church. On May 3rd, They tie the knot according to Hindu marriage rituals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X