For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెండి తెరపైకి మరో సూపర్‌స్టార్ వారసుడు.. సీతాయణంతో హీరోగా అక్షిత్ శశికుమార్

  |

  దక్షిణాది వెండితెరపైకి మరో నట వారసుడు ప్రవేశించనున్నారు. కన్నడ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన కన్నడ సుప్రీమ్‌ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరో గా గ్రాండ్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అక్షిత్ శ‌శికుమార్ తొలి చిత్రం సీతాయ‌ణం తెలుగు, కన్నడ భాషలలో రూపొందింది. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లలితా రాజ్యలక్షి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహిస్తున్నారు. అనహిత భూషణ్ హీరోయిన్‌గా నటించారు. రోహన్ భరద్వాజ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్చ్ చేస్తున్నారు.

  తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోకి డబ్బింగ్ చేసి, అన్నీభాష‌ల్లోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. డబ్బింగ్ , రీ రికార్డింగ్ పనులను పూర్తి చేసుకుని డి.టి.యస్ ఫైనల్ మిక్సింగ్ కార్యకలాపాలను ప్రసాద్ ల్యాబ్‌లో శరవేగంగా జరుపుకుంటోంది.

   Kannada Star Shashi Kumar’s Son Akshith Shashi Kumar introducing with Seethaayanam

  ఏ దశలోనూ రాజీ పడకుండా సీతాయణం సినిమాను చిత్రీకరించాం. 63 రోజులపాటు బ్యాంకాక్, బెంగళూర్, మంగళూర్, హైదరాబాద్, వైజాగ్, అగుంబే ప్రాంతాలలో షూటింగ్ జరిపాం. 'రెస్పెక్ట్ ఉమెన్' అన్న ట్యాగ్ లైన్ కి ఖచ్చితమైన జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉంటుంది. ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ కుమారుడు పద్మనాభ్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెలోడితో కూడిన చిత్రంలోని 5 పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలో ప్రముఖుల చేతులమీదుగా టీజర్, ట్రైలర్ లను విడుదల చేయిస్తాం" అన్నారు.

  దర్శకడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ, "నిర్మాతల పూర్తి సహకారంతో, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో అనుకున్నది అనుకున్న‌ట్టుగా మా సీతాయణం తెరకెక్కిస్తున్నాం. నేటి తరానికి నచ్చేలా, హృద్యమైన అంశాలు, సన్నివేశాలతో... సున్నితమైన భావాలకు అద్దం పడుతూ తెర‌కెక్కించాం. ఓ జంట‌ ప్రేమాయణంలో ఏర్ప‌డిన సమస్య ఎటువంటి టర్న్ తీసుకుంది? దీని పర్యవసానం ఏంటి ? హీరో పోరాటం చివరికి ఎలాంటి ఫలితాన్ని చూస్తుంది? అనేది క‌థాంశం. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న మా చిత్రం త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది.

  సీతాయణం చిత్రంలో పద్మనాభ్ భరద్వాజ్ అందించిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి, కొన్ని దశాబ్ధాలుగా తెలుగు వారి పెళ్లి శుభలేఖ పై ఉండే ఓ శ్లోకాన్ని తొలిసారిగా పాటరూపంలో తీసుకువస్తున్నాం. మరో విశేషం ఏంటంటే... ఈ చిత్రంలో ఒక పాటలోని బ్రీత్ లెస్ చరణాలను కన్నడ , తెలుగు భాషలలో ప్రముఖ గాయని శ్వేతా మోహన్ పాడగా తమిళంలో దళపతి విజయ్ కజిన్ పల్లవి సురేందర్ గానం చేసారు, ఈ పాట మూడు భాషల శ్రోతలను విశేషంగా అక్కట్టుకుంటుంది" అన్నారు.

   Kannada Star Shashi Kumar’s Son Akshith Shashi Kumar introducing with Seethaayanam

  తారాగణం: అజయ్ ఘోష్, విద్యుల్లేఖ‌ రామన్, మధునంద‌న్, బిత్తిరి సత్తి, విక్రమ్ శర్మ, హితేష్ శెట్టి, గుండు సుదర్శన్, కృష్ణ భగవాన్, జబర్దస్త్ అప్పారావు, అనంత్, బేబీ త్రియేక్ష, ఐ కె త్రినాథ్, మధుమణి, షర్మిత గౌడ, మేఘన గౌడ తదితరులు
  రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక
  కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
  ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
  సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
  ఫైట్స్: రియల్ సతీష్
  కొరియోగ్రఫీ: అనీష్
  సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
  నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి

  English summary
  Rohan Bharadwaj is presenting it in Mrs. Lalitha Rajyalakshmi’s production under Color Clouds Entertainments. Prabhakar Aaripaka is directing it starring Anahitha Bhushan as the female lead.As of now, Seethayanam team is wrapping up the post production works while the Dubbing, Re-recording & D.T.S final mixing works are commencing in Prasad Labs at brisk pace. However, makers plan to dub this Telugu - Kannada bilingual in Tamil & release the movie simultaneously in all 3 languages.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X