twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాలా’ వివాదంపై కర్నాటక సీఎం సంచలన వ్యాఖ్యలు

    By Bojja Kumar
    |

    కర్నాటకలో 'కాలా' విడుదలపై వివాదం రగులుతున్న నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. 'కాలా' మూవీ విడుదలకు సంబంధించి కర్నాటక హైకోర్టు ఆదేశాలు అమలు పరుస్తామని, ముఖ్యమంత్రిగా అది తన బాధ్యత అన్నారు.

    ప్రస్తుత పరిస్థితుల్లో కర్నాటకలో 'కాలా' విడుదల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచిది కాదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన వెల్లడించారు. కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. మరో వైపు కన్నడ సంఘాలు, కర్నాటక ఫిలిం ఛాంబర్ 'కాలా'ను నిషేధించాలని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

    Karnataka

    కావేరి జలాల వివాదంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగులుతున్న వివాదంలో రజనీకాంత్ గతంలో చేసిన వ్యాఖ్యలు తమిళనాడుకు మద్దతుగా ఉండటంతో కన్నడిగులు ఆయన నటించిన 'కాలా'పై తమ ప్రతాపం చూపించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని నిషేధించాలనే ఆందోళనలు తీవ్రతరం చేశారు.

    తమ సినిమాను విడుదల చేయలేని పరిస్థితి ఉండటంతో నిర్మాత ధనుష్‌ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా 'కాలా సినిమా ప్రదర్శన సజావుగా జరిగేలా చూడాలని, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

    'కాలా' విడుదలకు ఎలాంటి ఆటంకం కలగబోదని ఆశిస్తున్నట్లు రజనీకాంత్ లిపారు. కర్నాటకలో కన్నడ ప్రజలు మాత్రమే కాదు, ఇతర భాషల ప్రజలు కూడా ఉన్నారు, వారు సినిమా చూడాలనుకుంటున్నారు, అందుకు తగిన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు.

    English summary
    On the day that the Karnataka High Court ordered the state government to provide security to theatres that screen Kaala, Karnataka Chief Minister HD Kumaraswamy said that as a Kannadiga, he would not advocate releasing the Rajinikanth-starrer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X