KGF Chapter 2 Release Date: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ యుద్ధం తప్పేట్టులేదుగా?

తెలుగు సినిమా దశ-దిశ మొత్తాన్ని బాహుబలి సినిమా ఎలా మార్చేసిందో, కన్నడ సినిమా దశ దిశను కూడా కే జి ఎఫ్ సినిమాతో మారిపోయింది. ఈ సినిమా దెబ్బతో కన్నడ సినిమా ఖ్యాతి భారతదేశానికే కాక కొన్ని ఇతర దేశాలకు కూడా పాకింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కే జి ఎఫ్ 2 కొత్త రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మాకూ ఓ బాహుబలి

మాకూ ఓ బాహుబలి

2018 డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన కే జి ఎఫ్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ సినిమా దెబ్బతో కన్నడ సినిమా కీర్తి నలుదిశలా వ్యాపించింది.. అప్పటిదాకా ఇతర భాషల సినిమాలను చూసి మురిసిపోయే కన్నడ ప్రేక్షకులు కూడా తమ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో ఆనందంలో మునిగిపోయారు.

ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్

ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్

ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ కే కాక హీరో యష్ కి కూడా అనేక అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే యష్ పలు ప్రాజెక్టులలో బిజీగా ఉండగా ప్రశాంత్ నీల్ కూడా కే జి ఎఫ్ 2 సినిమాతో సహా తెలుగులో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు.. తెలుగులో టాప్ హీరోలైన ఎన్టీఆర్ తో ఒక సినిమా ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు ప్రశాంత్.

లెక్క ప్రకారం ఈ నెలలో

లెక్క ప్రకారం ఈ నెలలో

అయితే ఇందులో ప్రభాస్ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా ఎన్టీఆర్ తో సినిమా షూటింగ్ కూడా మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కే జి ఎఫ్ 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మారే అవకాశం ఉందని అంటున్నారు. కే జి ఎఫ్ 2 రిలీజ్ డేట్ ప్రకారం 16వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.

క్రిస్మస్ సీజనే టార్గెట్

క్రిస్మస్ సీజనే టార్గెట్

కానీ కరోనా రెండో దశ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను రెండువేల 21 డిసెంబర్ నెలలో క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.. నిజానికి 2018లో పార్ట్ వన్ కూడా అదే సీజన్లో రిలీజ్ చేయగా క్రిస్మస్ సెలవులు బాగా కలిసి వచ్చాయి. అందుకే ఈ సారి కూడా అలాగే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended Video

15 Songs That Helps To Overcome Depression | Best Sufi Songs | Filmibeat Telugu
వార్ తప్పదా

వార్ తప్పదా

అయితే ఈ సారి అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా అదే క్రిస్మస్ కి రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వార్ తప్పదు. ఇది డైరెక్ట్ సినిమా కాకపోయినా కేజిఎఫ్ 2 మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ కూడా మొదటిసారి డీ గ్లామర్ రోల్ లో కనిపిస్తుండడంతో ఆ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ ఒకే సమయానికి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X