Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శరవేగంగా కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్.. మాఫియాను మరింత భీకరంగా!
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ సమర్పిస్తున్నారు. కన్నడం, హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 శరవేగంగా పూర్తవుతోంది. లేటెస్టుగా ఈ సినిమాలో అధీరా పాత్రలో సంజయ్ దత్ లుక్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. సంజయ్ దత్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. తాజాగా షెడ్యూల్స్ వివరాల్ని దర్శకనిర్మాతలు వెల్లడించారు.
కేజీఎఫ్ చిత్రీకరణ జెట్ స్పీడ్ తో పూర్తవుతోంది. ఇప్పటికే మైసూర్' షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం బెంగళూరు కోలార్ మైన్స్‌లో వేసిన భారీ సెట్స్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్‌తో మేజర్ షెడ్యూల్ పూర్తవుతుంది. అలాగే 23 ఆగస్టు నుంచి హైదరాబాద్ పరిసరాల్లో షెడ్యూల్ కొనసాగుతుంది. నెలాఖరుకు అది పూర్తవుతుంది. ఆ తర్వాత కర్నాటక- బళ్లారి మైన్స్‌లో సంజయ్ దత్ అధీరా పాత్రపై చిత్రీకరణ సాగనుంది. ఈ షెడ్యూల్ తో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు అని తెలిపారు.

ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ ని చూపించనున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గనులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనులపై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్నదానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించబోతున్నారు.