For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాత్రికి రాత్రే స్టార్ అవ్వరు.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ వచ్చాను.. కేజీఎఫ్ స్టార్ కామెంట్స్

  |

  కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కొందరికి చిన్న చూపు. అక్కడ కూడా గొప్ప నటీనటులు ఉన్నా.. నిర్మాణ విషయంలో, సాంకేతికత విషయంలో అందరితో పోటీ పడలేరనే అపవాదుండేది. అయితే కన్నడలో వంద కోట్లు కొల్లగొట్టే సినిమానే రాలేదంటే ఎవ్వరు నమ్మరు. కానీ అది నిజం. కన్నడ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసేందుకు ఒకడొచ్చాడు. కేజీఎఫ్ సినిమాతో దేశం మొత్తాన్ని కన్నడ వైపుకు తిప్పుకున్నాడు. అలాంటి స్క్రిప్ట్ రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.

  అన్ని భాషల్లో సూపర్ హిట్..

  అన్ని భాషల్లో సూపర్ హిట్..

  రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపు 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రం కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో తిరుగులేని విజయాన్ని సాధించింది.

  ఇండియన్ స్టార్‌గా యశ్‌..

  ఇండియన్ స్టార్‌గా యశ్‌..

  ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా.. కన్నడ ఇండస్ట్రీ పవరేంటో చూపించాడు. ఈ మూవీతో యశ్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. బాహుబలితో ప్రభాస్ ఇండియన్ హీరోగా ఎదిగితే.. కేజీఎఫ్‌తో యశ్ ఎనలేని ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు.

  శరవేగంగా చాప్టర్ 2

  శరవేగంగా చాప్టర్ 2

  ప్రస్తుతం సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 శ‌ర‌వేగంగా తెరకెక్కుతుంది. ఇక కేజీఎఫ్ చాప్టర్- 2ను వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో సినిమాని రిలీజ్‌ చేయ‌నున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్రలో నటించనున్నాడు.

  ఒక్కసినిమాతో పెద్ద స్టార్..

  ఒక్కసినిమాతో పెద్ద స్టార్..

  కేజీఎఫ్ సృష్టించిన సునామితో యశ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఎక్కడా చూసినా అతను చెప్పిన డైలాగ్‌లే, అతని వాల్ పోస్టర్సే, సోషల్ మీడియాలో అతని ప్రొఫైల్ పిక్‌లే దర్శనమిచ్చేవి. భాషతో సంబంధం లేకుండా అందరూ యశ్‌ను అభిమానించసాగారు. అయితే ఈ ఒక్క సినిమాతో యశ్ పెద్ద స్టార్ అయిపోయాడని ఈ మధ్య తరుచుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

  #Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
  రాత్రికి రాత్రే స్టార్ అవ్వరు..

  రాత్రికి రాత్రే స్టార్ అవ్వరు..

  కాగా తాజాగా ఈ వార్తల పై స్పందించిన యశ్ ‘ఎవ్వరూ రాత్రికి రాత్రే స్టార్ అవ్వరని.. ఓ వ్యక్తి చాలా సంవత్సరాలు కష్టపడితేనే స్టార్ డమ్ వస్తోందని.. నేను అలా కష్టపడిన వ్యక్తినేనని.. ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటే గానీ తనకు ఈ గుర్తింపు వచ్చిందని.. 2008 నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను నిర్మించుకున్నానని యశ్ తెలిపాడు.

  English summary
  KGF Star Yash Open About His Stardom. Sandalwood Superstar Yash, in a recent interview, opened up about his struggling days as an actor. The KGF star spoke about the years of hard work he has put in and that the road to success wasn't an easy one for him. "One film doesn't change the fate of a person. It is a process, what one has done over a period of time sometimes come together as a force. I did not become a star overnight. I built my career brick-by-brick. There were years of hard work behind me before KGF happened," said Yash.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X