»   » #మీటూ: అర్జున్ వర్సెస్ శృతి, రెండుగా చీలిన ఇండస్ట్రీ, తల పట్టుకున్న సినీ పెద్దలు!

#మీటూ: అర్జున్ వర్సెస్ శృతి, రెండుగా చీలిన ఇండస్ట్రీ, తల పట్టుకున్న సినీ పెద్దలు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sruthi Hariharan Says No Compromise With Arjun Sarja

  'విస్మయ'(కురుక్షేత్రం) సినిమా సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రముఖ నటుడు అర్జున్ సార్జాతో రాజీడే ప్రసక్తే లేదని, ఈ విషయంలో తాను న్యాయం పోరాటం చేయబోతున్నట్లు కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ తేల్చి చెప్పారు. గురువారం సాయంత్రం బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

  అంతకు ముందు కర్నాటక సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష్ మరికొందరు పెద్దలతో కలిసి అర్జున్-శృతి హరిహరన్ మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శృతి హరిహరన్ చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్దం అంటూ అర్జున్ మామయ్య రాజేష్ కర్నాటక ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన అనంతరం శృతి హరిహరన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి న్యాయపోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించారు.

  రెండుగా చిలిన ఇండస్ట్రీ

  రెండుగా చిలిన ఇండస్ట్రీ

  అంతకు ముందు శృతి హరిహరన్, అర్జున్ మధ్య రాజీ కుదిర్చేందుకు ఇండస్ట్రీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అంబరీష్‌తో పాటు దర్శకుడు కవితా లంకేష్, నటి పూజా గాంధీ, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు చిన్నె గౌడ, ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నిర్మాత మణిరత్న పాల్గొన్నారు. అర్జున్-శృతి ఇష్యూలో ఇండస్ట్రీ రెండుగా చిలినట్లు తెలుస్తోంది.

  త్వరలో నిర్ణయం తీసుకుంటాం

  త్వరలో నిర్ణయం తీసుకుంటాం

  కన్నడ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష్ మాట్లాడుతూ... ‘ఇద్దరి వాదనలు విన్నాము. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం. శృతి హరిహరన్ తన పట్ల అర్జున్ తప్పుగా వ్యవహరించాడని అంటోంది, అర్జున్ తాను ఏ తప్పూ చేయలేదు అంటున్నారు. ఏది తప్పు? ఏది ఒప్పు? అని మేము ఇప్పుడే ఎలా నిర్ణయించగలం?' అని వ్యాఖ్యానించారు.

  నా విజయం వారికి గుణపాఠం అవుతుంది: అర్జున్

  నా విజయం వారికి గుణపాఠం అవుతుంది: అర్జున్

  ఈ సమావేశం నుంచి అర్జున్ సార్జా బయటకు వస్తూ ఈ పోరాటంలో తాను విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. నా విజయం... నటుల రెప్యుటేషన్ దెబ్బతీయాలని కుట్రలు చేసే వారికి ఒక గుణపాఠం అవుతుందన్నారు. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు.

  శుక్రవారం వరకు కంప్లయింట్ చేయకుండా ఆగమన్నారు: శృతి హరిహరన్

  శుక్రవారం వరకు కంప్లయింట్ చేయకుండా ఆగమన్నారు: శృతి హరిహరన్

  అర్జున్ మీద కంప్లయింట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. అయితే ఫిల్మ్ చాంబర్ పెద్దలు శుక్రవారం వరకు ఆగమన్నారు. వారిపై నాకు గౌరవం ఉంది. మీటింగ్ అనంతరం నా నిర్ణయం వెల్లడిస్తాను అని శృతి హరిహరన్ తెలిపారు.

  శృతి మీద పరువు నష్టం దావా

  శృతి మీద పరువు నష్టం దావా

  కాగా... శృతి హరిహరన్ మీద అర్జున్ సార్జా ఇప్పటికే రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు.

  English summary
  Sruthi Hariharan says no compromise with Arjun Sarja. “I am the one who has been wronged. I respect KFCC and since they have asked me to hold off filing a complaint till Friday, I will respect that. I will announce my decision once the meeting is over. I wanted to file a complaint when I came out with my story but since the Film Chamber members told me to hold off for a while, I respected that,” Sruthi added.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more