twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా లాక్‌డౌన్‌లోనే హీరో పెళ్లి.. మాజీ సీఎం ఇంట్లో బాజాభజంత్రీలు.. ఎంతమందికి ఆహ్వానం అంటే!

    |

    కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా పరిశ్రమే స్తంభించడమే కాకుండా.. సినీ తారల పెళ్లిళ్లు కూడా వాయిదా పడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే లాక్‌డౌన్ సమయంలో కూడా కన్నడ మాజీ సీఎం కుమారస్వామి గౌడ కొడుకు వివాహానికి బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాజీ సీఎం స్వయంగా ధృవీకరించారు. ఆయన ఏం చెప్పారంటే..

    ఘనంగా నిఖిల్ కుమారస్వామి నిశ్చితార్థం

    ఘనంగా నిఖిల్ కుమారస్వామి నిశ్చితార్థం

    యువ రాజకీయ నాయకుడు, హీరో నిఖిల్ కుమారస్వామి వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీన బెంగళూరులోని తాజ్ వెస్ట్‌లో ఘనంగా నిర్వహించారు. దాదాపు 6 వేల మందికిపైగా అతిథులను ఈ వేడుకకు ఆహ్వానించారు. గౌడ ఫ్యామిలీలో న భూతో న భవిష్యత్‌గా పెళ్లిని కూడా జరిపించాలని భారీగా ఏర్పాట్లు కూడా చేశారు.

    ఏప్రిల్ 17న పెళ్లికి ఏర్పాట్లు

    ఏప్రిల్ 17న పెళ్లికి ఏర్పాట్లు

    నిఖిల్ కుమారస్వామి పెళ్లికి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తుండగా కరోనావైరస్ విజృంభించడంతో పనులు ఆపివేశారు. అయితే పెద్దలు నిర్ణయించిన ముహుర్తానికే అంటే ఏప్రిల్ 17వ తేదీన శుభదినం రోజున పెళ్లిని జరిపించేందుకు నిర్ణయించాం అని మాజీ సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు.

    ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే

    ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే


    నిఖిల్ కుమార్ స్వామి వివాహం రేవతితో ఏప్రిల్ 17వ తేదీన జరుగుతుంది. కాకపోతే వివాహ వేడుకలో కేవలం 15 నుంచి 20 మంది అతిథులు మాత్రమే హాజరవుతారు. ఇరు కుటుంబాలకు చెందిన కొంత మంది ముఖ్యమైన వారే ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. మా ఇంటిలోనే వివాహం జరుగుతుంది. ఆ తర్వాత సరైన సమయం చూసి విందును గ్రాండ్‌గా నిర్వహిస్తాం అని మాజీ సీఎం కుమారస్వామి గౌడ చెప్పారు.

     నిఖిల్ పెళ్లిపై స్పష్టీకరణ

    నిఖిల్ పెళ్లిపై స్పష్టీకరణ

    నిఖిల్ కుమారస్వామి పెళ్లి గురించి మాజీ సీఎం వర్గాలు ధృవీకరిస్తూ.. బెంగళూరులోని విజయ్‌నగర్‌లోని నివాసంలో రేవతి మెడలో నిఖిల్ తాళి కడుతారు. ఇరు కుటుంబాల తరఫున చెరో పది మంది హాజరవుతారు అని అన్నారు. శుభ దినం, మంచి ముహుర్తం కావడంతో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు అని తెలిపారు.

    Recommended Video

    Nikhil Siddharth About His Honeymoon
    రామనగర జిల్లాలో భారీగా విందు

    రామనగర జిల్లాలో భారీగా విందు

    ఒకసారి కరోనా భయాలు తొలగిన తర్వాత రామనగర జిల్లాలో భారీగా వేడుకలు నిర్వహిస్తాం. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో భారీ హంగుల మధ్య విందును ఏర్పాటు చేస్తాం అని మాజీ సీఎం సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ సమయంలో జిల్లావాసులందరికి ఉచితంగా విందు భోజనం పెడుతాం అని వెల్లడించారు.

    English summary
    Nikhil’s father and former Karnataka CM, HD Kumaraswamy recently addressed the media to confirm that the wedding will indeed take place on April 17 as it is an 'auspicious day’. He said,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X