ఆ పాత్ర రమ్యకృష్ణకా? ఖుష్బూకా? సంచలన చిత్రం కోసం పోటీ!

By Rajababu

విలక్షణ నటుడు ధనుష్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం పా పాండి. 2017లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్ర రీమేక్ హక్కులను తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకొన్నారు. కన్నడలో ఈ చిత్ర రీమేక్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో ప్రచారమవుతున్నది.

కన్నడలో రాజ కిరణ్ పోషించిన పాత్రలో ప్రముఖ నటుడు అంబరీష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అంబి నినాద్ వయస్సైథో అనే టైటిల్‌ను పెట్టారు. తొలుత ఈ చిత్రంలో అంబరీష్ సరసన సుహాసిని మణిరత్నం నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. తాజాగా అంబరీష్ సరసన నటించే పాత్ర కోసం రమ్యకృష్ణ, ఖుష్భూ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Pa Paandi Kannada remake: war between Ramya Krishnan and Khushbu

పా పాండి చిత్రంలో యంగ్ రాజ్ కిరణ్ పాత్రను ధనుష్ పోషించాడు. కన్నడంలో ధనుష్ పాత్రను కిచ్చ సుదీప్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుదీప్ స్వీయ నిర్మాణ సారథ్యంలో కిచ్చ క్రియేషన్స్‌లో రూపొందిస్తున్నారు. కన్నడ రీమేక్ కోసం గురుదత్త గనిగా అనే దర్శకుడిని రంగంలోకి దించారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X