twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెజిఎఫ్ హీరో యష్ భార్యపై రూమర్స్... ఆమెను అందులోకి దింపుతున్నాడా?

    |

    Recommended Video

    KGF Star Yash Trying To Get His Wife Radhika Pandit Into Politics? || Filmibeat Telugu

    'కెజిఎఫ్' సినిమాతో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాపులారిటీ ఇండియా వైడ్ విస్తరించింది. ఈ సినిమాతో ఇప్పటి వరకు ఉన్న సాండల్‌వుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. మంచి కంటెంట్ ఉంటే కన్నడ సినిమాలు కూడా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు వసూలు చేస్తాయని నిరూపించాడు.

    అయితే తాజాగా యష్ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ కన్నడ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ హీరో తన భార్యను రాజకీయాల్లోకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన నటి సుమలత అంబరీష్‌కు యష్ తన మద్దతు ప్రకటించడంతో పాటు మాండ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆమె గెలుపుకు తన వంతు కృషి చేశారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, యువ నటుడు నిఖిల్ ఓడిపోయేలా చేశారు.

    యష్‌లో పొలిటికల్ స్కిల్స్ ఉన్నాయి

    యష్‌లో పొలిటికల్ స్కిల్స్ ఉన్నాయి

    ఎన్నికల సమయంలో తనను కార్న్ చేస్తూ ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను యష్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. యష్‌ ప్రచారం నిర్వహించిన తీరు, మీడియాతో ఆయన మాట్లాడిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడికి రాజకీయాల్లో రాణించగలిగే స్కిల్స్ ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయలు వ్యక్తం చేశారు.

    భార్యను రాజకీయాల్లోకి దింపుతున్నాడా?

    భార్యను రాజకీయాల్లోకి దింపుతున్నాడా?

    ఈ క్రమంలోనే యష్ తన భార్య రాధిక పండిత్‌ను రాజకీయాల్లోకి దింపుతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. హసన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎం కుమారస్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా...

    ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా...

    అయితే ఈ వార్తలపై యష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ఫ్యాన్స్ గతంలో రాధిక పండిత్ నటించిన కడ్డిపూడి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. ఈ కన్నడ చిత్రంలో రాధిక క్లిష్టమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతుంది.

    కానీ అసలు వాస్తవం ఇదీ...

    కానీ అసలు వాస్తవం ఇదీ...

    ఈ రూమర్స్‌పై యష్ సన్నిహితులు స్పందించారు. రాధికను యష్ రాజకీయాల్లోకి దింపుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కూతురుకు జన్మనిచ్చిన రాధిక అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోందని, ప్రేక్షకుల మదిలో తాను నటిగా గుర్తిండి పోవాలని మాత్రమే ఆమెకు ఉంది, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని అంటున్నారు.

    English summary
    Rumour on social media is doing rounds stating that Yash is planning to bring her into politics. Yes, going by the posts she would contest from Hassan Lok Sabha constituency.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X