twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneeth Rajkumar దక్షిణాదిలో సంపన్న హీరోగా.. రెమ్యునరేషన్ ఎంత తెలుసా? ఆయన ఆస్తుల వివరాలు మీకోసం..

    |

    కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం లక్షలాది మంది అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచేసింది. మరణించడానికి కొన్ని గంటల ముందు కూడా హుషారుగా, ఉత్సాహంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అప్పు ఇక లేరంటే ఫ్యాన్స్, సన్నిహితులు, సినీ తారలు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి విషాద సమయంలో పునీత్ స్టార్ వాల్యూ, ఆయన సంపద గురించిన వివరాలు ఇంటర్నెట్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    చెదరని చిరునవ్వుతో కూడిన రూపం

    చెదరని చిరునవ్వుతో కూడిన రూపం

    సూపర్ స్టార్ ఇమేజ్‌ ఉన్నా అతి సాధారణమైన వ్యక్తిగా అందరివాడుగా ప్రతీ ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్నారు. అలాంటి స్టార్ హీరో భౌతికంగా ఈ లోకం నుంచి దూరమైనా ఆయన చిరునవ్వుతో కూడిన రూపం మాత్రం చెక్కుచెదరని శిల్పంలా మనోఫలకాలపై చిరకాలం ఉండిపోవడం ఖాయం.

    తండ్రి వారసత్వంగా సినీ రంగంలోకి

    తండ్రి వారసత్వంగా సినీ రంగంలోకి

    కన్నడ సినీ పరిశ్రమలో తండ్రి రాజ్‌కుమార్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలనటుడిగా పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌ను ప్రారంభించారు. చలిసువా మొడగాళ్లు, ఏరావు నక్షత్రగలే చిత్రాల్లో అద్భుతమైన నటనకు గాను ఉత్తమ బాలనటుడి అవార్డును అందుకొన్నారు. 2002లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులో ఘన విజయం సాధించిన ఇడియెట్ చిత్రం రీమేక్ అప్పుతో హీరోగా మారారు. అప్పటి నుంచి పునీత్ రాజ్‌కుమార్ ఎదురే లేకుండా పోయింది.

     30 చిత్రాలతో పవర్ స్టార్‌గా

    30 చిత్రాలతో పవర్ స్టార్‌గా

    పునీత్ రాజ్‌కుమార్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు సుమారు 30 చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా యువరత్న. పునీత్ నటించిన చిత్రాలు జేమ్స్, ద్వైత విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అభి, వీర కన్నడిగా, మౌర్య, ఆకాశ్, బిందాస్, పృథ్వీ, జాకీ, పరమాత్మ, రానా విక్రమా, రాజకుమార, అంజనీపుత్ర హంబుల్ పొలిటిషన్ నోగరాజ్, వసంతగీత, బెయ్యాడ హూవు లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

    ప్రతీ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే?

    ప్రతీ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే?

    కన్నడ సినీ రంగంలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకొన్న పునీత్ రాజ్ కుమార్ భారీ రెమ్యునరేషన్ అందుకొన్నారు. ఒక్కో సినిమాకు ఆయన రూ.3 కోట్ల నుంచి 4 కోట్ల పారితోషికాన్ని అందుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక వ్యాపార ప్రకటనల్లో నటించినందుకు గాను కోటి రూపాయాలకుపైగా రెమ్యునరేషన్ అందుకొంటున్నారు. ఇలా కన్నడలో అత్యధికంగా పారితోషికం అందుకొనే హీరోల్లో ఒకరిగా ఘనతను సాధించారు.

     ఫోర్బ్స్ సంస్థ అంచనా ప్రకారం..

    ఫోర్బ్స్ సంస్థ అంచనా ప్రకారం..

    పునీత్ రాజ్‌కుమార్ వ్యక్తిగత సంపద విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఫోర్బ్స్, బిజినెస్ ఇన్‌సైడర్, వికీపీడియా అందించిన సమాచారం ప్రకారం.. ఆయన ఆస్థి సుమారు 35 నుంచి 40 కోట్ల వరకు ఉంటుంది. కన్నడ సినీ పరిశ్రమలో సంపన్నమైన హీరోల్లో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు.

    Recommended Video

    Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
    అక్టోబర్ 31న అంత్యక్రియలు

    అక్టోబర్ 31న అంత్యక్రియలు

    ఇదిలా ఉండగా, పునీత్ రాజ్‌కుమార్ పార్ధీవదేహానికి శ్రద్దాంజలి ఘటించేందుకు కన్నడ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభిమానులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి పోటెత్తారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం అంటే.. అక్టోబర్ 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు కన్నడ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో ఉంటున్న పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె బెంగళూరుకు చేరుకొన్న తర్వాత అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    English summary
    Kannada Power Star Puneeth Rajkumar is no more. He died at 46 years due to heart attack. Here is his net worth, assets, Remuneration details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X