twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కావేరి వివాదం: కర్నాటకలో ‘కాలా’ కష్టాలు.... బాహుబలి తరహా సీన్ రిపీట్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Rajini & Vijay Fans Argue Regarding Kaala Scenes

    రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన 'కాలా' చిత్రం జూన్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సోమవారం సాయంత్రం విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిన గడ్డ కర్నాటకలో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. కావేరి వివాదం నేపథ్యంలో కన్నడిగులు రజనీకాంత్ మీద ఆగ్రహంగా ఉండటమే ఇందుకు కారణం.

    ‘కాలా’ను ప్రదర్శించ వద్దన్న కెఎఫ్‌సిసి ప్రెసిడెంట్

    ‘కాలా’ను ప్రదర్శించ వద్దన్న కెఎఫ్‌సిసి ప్రెసిడెంట్

    ‘కాలా'ను ప్రదర్శించవద్దని కర్నాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సా రా గోవిందు కర్నాటక థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్లను కోరారు. రజనీకాంత్ మీద కన్నడ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, అందు వల్ల కాలా సినిమాకు దూరంగా ఉండాలని సూచించారు.

     రజనీకాంత్ కామెంట్స్ కన్నడిగులను అప్‌సెట్ చేశాయి

    రజనీకాంత్ కామెంట్స్ కన్నడిగులను అప్‌సెట్ చేశాయి

    కావేరీ జలాల వివాదంలో రజనీకాంత్ కామెంట్స్ కన్నడిగులను అప్‌సెట్ చేశాయని, అలాంటి వ్యక్తి నటించిన సినిమా కర్నాటకలో విడుదల కాకూడదని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పలు కన్నడ సంఘాల నుండి ఫిల్మ్ చాంబర్‌కు ఈ విషయమై విన్నపాలు వచ్చాయని, ‘కాలా' సినిమాపై బ్యాన్ విధించాలని కోరుతున్నారని, విడుదల ఆపాలంటూ తమపై చాలా ఒత్తిడి ఉందని గోవిందు పేర్కొన్నారు.

    ఫిల్మ్ చాంబర్‌తో డిస్ట్రిబ్యూటర్ చర్చలు

    ఫిల్మ్ చాంబర్‌తో డిస్ట్రిబ్యూటర్ చర్చలు

    కర్నాటకలో ‘కాలా' చిత్రాన్ని గోల్డీ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇవ్వాలని కన్నడ ఫిల్మ్ చాంబర్‌తో చర్చలు జరుపుతున్నట్లు డిస్ట్రిబ్యూటర్ సౌరవ్ మీడియాకు వెల్లడించారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని తెలిపారు.

    గతంలో బాహుబలికి ఇలాంటి చిక్కులే

    గతంలో బాహుబలికి ఇలాంటి చిక్కులే

    గతంలో బాహుబలి-2 సినిమా విడుదల సమయంలో కూడా కర్నాటకలో ఇలాంటి ఇబ్బందే ఏర్పడింది. ఈ చిత్రంలో నటించిన తమిళ నటుడు సత్యరాజ్ కావేరీ జలాల విషయంలో ఎప్పుడో చేసిన కామెంట్స్‌పై కన్నడ సంఘాలు రగిలిపోతూ తమ ప్రతాపై సినిమాపై చూపించారు. చివరకు సత్యరాజ్‌, దర్శకుడు రాజమౌళి ఈ విషయంలో క్షమాపణలు చెప్పడంతో కర్నాటకలో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

    English summary
    Kaala, which is supposed to hit the theatres worldwide on June 7, may not release in Karnataka, courtesy Rajinikanth's opinion on the Cauvery row. Sa Ra Govindu, President of Karnataka Film Chamber of Commerce (KFCC) has stated that he'd request the theatre owners and distributors to not screen Kaala or be associated with the film in any way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X