»   » ప్రముఖ హీరోతో రష్మిక ఎంగేజ్‌మెంట్.. కెరీర్ జోరులో ఉండగానే పెళ్లా?

ప్రముఖ హీరోతో రష్మిక ఎంగేజ్‌మెంట్.. కెరీర్ జోరులో ఉండగానే పెళ్లా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడలో సంచలన విజయం సాధించిన కిరిక్ పార్టీలో నటించి రక్షిత్ శెట్టి, రష్మిక మందన నిజజీవితంలో ఒక్కటవుతున్నారు. కిరిక్ పార్టీలో ఈ యువ జంటకు అనూహ్యమైన క్రేజ్ లభించింది. ఈ చిత్రంలో నటించిన తర్వాత వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గత కొద్దికాలంగా సాగుతున్న అఫైర్ ముగింపు పలికి పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు రక్షిత్ శెట్టి, రష్మిక ఎంగేజ్‌మెంట్ సోమవారం బెంగళూరులో జరుగనున్నది.

రక్షిత్ శెట్టితో నేడు బెంగళూరులో నిశ్చితార్థం

రక్షిత్ శెట్టితో నేడు బెంగళూరులో నిశ్చితార్థం

రీల్ లైఫ్‌లో కిరిక్ పార్టీలో జంటగా ప్రేక్షకులకు కనువిందు చేసిన రక్షిత్, రష్మిక పెళ్లి బాజాలు త్వరలో మ్రోగనున్నాయి. వారి నిశ్చితార్థం కూర్గ్ సమీపంలోని మడికెరిలోని విరాజ్‌పెట్‌లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు జరుగనున్నది. ప్రైవేట్ వ్యవహారంగా జరుగుతున్న ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను, ప్రముఖ సినీతారలను ఆహ్వానించినట్టు సమాచారం.

2500 మందికి ఆహ్వానం

2500 మందికి ఆహ్వానం

హై ప్రొఫైల్ జరుగుతున్న నిశ్చితార్థ వేడుకకు దాదాపు 2500ని ఆహ్వానించినట్టు తెలుస్తున్నది. అతిథుల జాబితాలో ఉపేంద్ర, సుదీప్, యష్, ఇతర హీరోలు ఉన్నారు. టాలీవుడ్‌కు చెందిన కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు సమాచారం. కెరీర్ మంచి జోష్‌లో ఉన్న సమయంలో రష్మిక పెళ్లి చేసుకోవడం చర్చానీయాంశమైంది.

హై సెక్యూరిటీ మధ్య

హై సెక్యూరిటీ మధ్య

నిశ్చితార్థ వేడుక వేదిక వద్ధ భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నండటంతో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. వేదిక సమీపంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇన్విటేషన్ ఉన్నవారికే..

ఇన్విటేషన్ ఉన్నవారికే..

భద్రతాపరమైన సమస్యలు ఉన్నందున్న ఎంగేజ్‌మెంట్ ఇన్విటేషన్ ఉన్నవారినే కన్వెన్షన్ హాల్‌లోకి అనుమతిస్తాం అని రష్మిక తండ్రి మందన తెలిపారు. ఈ వేడుక కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూజిక్ ట్రూప్‌లను, వెరైటీ ఫుడ్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Kirik Party actors Rakshit Shetty and Rashmika Mandanna are set to get engaged today at Virajpet in Madikeri at 6:30pm. More than 2,500 guests including celebrities from Sandalwood industry have been invited for the engagement ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu