Don't Miss!
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
KGF Chapter 2లో రావు రమేష్ లుక్.. కీలక పాత్రను రివీల్ చేసిన చిత్ర యూనిట్
కొంత కాలంగా భారతదేశం మొత్తం చర్చనీయాంశం అవుతోన్న చిత్రాల్లో 'KGF Chapter 2' ఒకటి. కొన్నేళ్ల క్రితం ప్రశాంత్ దర్శకత్వంలో యశ్ నటించిన 'KGF Chapter 1'కు ఇది సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ కోట్లను కొల్లగొట్టింది. దీనికితోడు యాక్షన్ విభాగంలో జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఫలితంగా రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి ఓ పోస్టర్ విడుదలైంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'KGF Chapter 2'లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రావు రమేష్ కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఈ సినిమాలో రావు రమేష్ చేస్తున్న పాత్రను రివీల్ చేస్తూ ఓ మేగజైన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన సీబీఐ ఆఫసర్ కన్నెగంటి రాఘవన్ పాత్రను చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఒక న్యూస్ ఐటమ్‌లో 'కేజీఎఫ్ కోసం స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన రాఘవన్' అని ఓ ఆర్టికల్ ఉంటే.. 'రాఘవన్ కన్ను సీబీఐ మీద ఉందా? కేజీఎఫ్ మీద ఉందా' అనే మరో ఆర్టికల్ కూడా ఉంది.
Wishing the versatile actor #RaoRamesh sir a very safe Happy Birthday.
— Prashanth Neel (@prashanth_neel) May 25, 2021
Here's a glimpse of #KannegantiRaghavan in #KGFChapter2.
Stay home stay safe everyone🙏🏻 pic.twitter.com/V1nWcJtthg

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'KGF Chapter 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్ నేషనల్ వైడ్‌గా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక, ఈ సినిమాలో రాఖీ భాయ్‌ను ఎదిరించేందుకు అధీరా ఎంట్రీ ఇస్తాడు. వీళ్లిద్దరి మధ్య పోరాటంతో ఇది రూపొందింది. ఇందులో అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవీనా టాండన్ కీలక పాత్రను చేస్తున్నారు. రవి బస్రూర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.