twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్నీలియోన్ దిష్టి బొమ్మ దగ్ధం.. ఆమెతో అలాంటి సినిమా చేస్తారా!

    |

    Recommended Video

    సన్నీలియోన్ పై కర్ణాటకలో నిరసనలు

    సన్నీలియోన్ పేరు వింటేనే బెంగుళూరు నగరం అట్టడుగుతోంది. కనీసం సన్నీలియోన్ ని బెంగుళూరులో అడుగుపెట్టేందుకు కూడా కర్ణాటక ప్రజలు అంగీకరించడం లేదు. గతంలో పలు కార్యక్రమాలకు సన్నీలియోన్ హాజరు కావలసి ఉన్నా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసారు. తాజాగా కర్ణాటకలో సన్నిలియోన్ పై పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తుతున్నాయి. సన్నీలియోన్ నటిస్తున్న వీరమదేవి చిత్రం విషయంలో కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు రగిలిపోతున్నారు.

    సంస్కృతికి వ్యతిరేకం

    సంస్కృతికి వ్యతిరేకం

    సన్నీలియోన్ ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటించడం తమ సంస్కృతికి విరుద్ధం అంటూ కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం రోజు బెంగుళూరు వ్యక్తంగా ఈ నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి.

    చారిత్రాత్మక నేపథ్యంలో

    చారిత్రాత్మక నేపథ్యంలో

    వీరమాదేవి చిత్రంలో సన్నీలియోన్ వారియర్ క్వీన్ గా నటిస్తోంది. భారీ పోరాట సన్నివేశాలతో ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. సన్నీలియోన్ ని ఏ చిత్రంలో నటింపజేయడమే తప్పుగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు, హిందీ సంఘాలు ఆరోపిస్తున్నారు. వెంటనే సన్నీలియోన్ ని ఈ చిత్రం నుంచి తప్పించాలని లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో చిత్ర విడుదల అడ్డుకుంటామని కన్నడ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

    అన్ని భాషల్లో విడుదల

    అన్ని భాషల్లో విడుదల


    వీరమాదేవి చిత్రాన్ని తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. వడివుడైయాన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫోన్సే స్టీఫెన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.

    వీరనారిగా తొలిసారి

    వీరనారిగా తొలిసారి


    సన్నీలియోన్ ఇప్పటి వరకు ఐటెం సాంగ్స్, శృంగార తరహా పాత్రలు చేసింది. కానీ ఇలా వారియర్ క్వీన్ గా తమిళ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. చూస్తుంటే కర్ణాటకలో ఈ చిత్ర విడుదలకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. కారవే యువసేన అధ్యక్షుడు మాట్లాడుతూ.. సన్నీలియోన్ పైనే మా పోరాటం. ఆమె ఈ చిత్రంలో నటించడం మన సంసృతికి విరుద్ధం . ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఈ చిత్రంలో నటించడానికి వీల్లేదు అంటూ కరావే యువసేన విభాగం ఘాటైన వార్నింగ్ ఇస్తోంది.

    English summary
    Sunny Leone's Film Posters Burnt in Bengaluru.Pro-Kannada outfit protests against Sunny Leone's Veeramadevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X