For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KGF కంటే హై రేంజ్‌లో యష్ బిగ్ మూవీ.. బాహుబలి బ్యూటీ రేటెంతంటే?

  |

  KGF మొదటి పార్ట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకొని పక్క ఇండస్ట్రీలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. అంతగా సంచలనం సృష్టించిన ఆ సినిమాతో కథానాయకుడు యష్ స్థాయి కూడా పెరిగింది. కన్నడ హీరో కూడా పక్క ఇండస్ట్రీలలో సత్తా చూపించగలడాని యష్ నిరూపించాడు.

  KGF Star Yash’s Next Movie Update | Filmibeat Telugu
  KGF 2 క్రేజ్..

  KGF 2 క్రేజ్..

  KGF ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం ఒక విధంగా చిత్ర యూనిట్ పై మరీంత ఒత్తిడి పెంచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మొదటి కథకు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు సీక్వెల్ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఆడియెన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకూడదని దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను మంచి కంటెంట్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు.

  యష్ ప్లానింగ్..

  యష్ ప్లానింగ్..

  కథానాయకుడు యష్ కూడా ఈ లాక్ డౌన్ లో తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో కన్నడ స్టార్ దర్శకులతో చర్చలు జరుపుతున్నారట. ఇక నార్తన్ అనే కన్నడ దర్శకుడు చెప్పిన ఒక కథపై యష్ పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపు ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లే అని టాక్ వస్తోంది. యష్ మరో రెండు కథలను కూడా ఈ గ్యాప్ లోనే ఫిక్స్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

   KGF కంటే హై రేంజ్‌లో..

  KGF కంటే హై రేంజ్‌లో..

  KGF 1 బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టడంతో నెక్స్ట్ రాబోయే సీక్వెల్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని యష్ నమ్మకంతో ఉన్నాడు. అందుకే యష్ తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా తరహాలోనే భారీగా రిలీజ్ అవుతాయట. ఒక్కసారి సెట్ చేసుకున్న మార్కెట్ ని మళ్ళీ మిస్ చేసుకోవద్దని యష్ తన నెక్స్ట్ ప్రాజెక్టును కూడా KGF కంటే హై రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడట.

  బాహుబలి బ్యూటీ రేటెంత?

  బాహుబలి బ్యూటీ రేటెంత?

  దర్శకుడు నార్తన్, యష్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల తమన్నా భాటియాను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. సౌత్ నార్త్ లో మిల్కి బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆమెనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. పైగా గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. ఇకపోతే ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం తమన్నా భారీగానే డిమాండ్ చేసిందట. గత ఏడాది వరకు బిగ్ బడ్జెట్ సినిమాలకు 75 నుంచి 90లక్షల వరకు తీసుకున్న తమన్నా ఇప్పుడు ఆ రేటును కోటి దాటించేసిందట. పాన్ ఇండియా మూవీ కావడంతో అమ్మడు ఇంకాస్త పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

  English summary
  Talking about the news that director Narthan and Tamanna Bhatia have been selected for the Yash project recently. Milky Beauty has a good craze in the Southand North, so she has the chance to make it to the finals. Also increasing the dose of glamor. If not, Tamanna is a huge demand for a movie in this combination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X