హీరో దర్శన్ కేసులో షాకింగ్ ట్విస్ట్..ఫామ్‌హౌస్‌లో మేనేజర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏమున్నదంటే?
కన్నడ నటుడు దర్శన్ కేసు రోజురోజుకు బలిష్ఠం అవుతుంది. ఒకరి తరువాత ఒకరు చనిపోవడం మరింత భయంకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. గతవారం రేణుకా స్వామి అనే వ్యక్తి మృతితో ఈ వివాదం మొదలయ్యింది. శవపరీక్ష నివేదికలో తల, పొత్తికడుపు, ఛాతీ మరియు ఇతర భాగాలపై గుర్తులతో సహా అతని శరీరంపై 15 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులోని ఓ షెడ్డులో ఆగి ఉన్న మినీ ట్రక్కును రేణుకా స్వామి తల ఢీకొట్టిందని కూడా చెప్పుకొచ్చారు.
ఈ కేసులో దర్శన్ తో పాటు మరికొంతమందిని అరెస్ట్ కూడా చేశారు.ఇక ఇంకోపక్క నటి పవిత్ర గౌడ కూడా ఈ కేసులో ముద్దాయిగా మారింది. పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పంపాడనే కోపంతో తన అభిమాని రేణుకా స్వామిని దర్శన్ కిడ్నాప్ చేయించినట్టు తేలింది. దర్శన్- పవిత్ర మధ్య అక్రమ సంబంధం ఉండడం, రేణుక స్వామి.. పవిత్రను వేధించాడన్న కోపంతోనే దర్శన్ అతన్ని చంపాడని పోలీసులు తేల్చి చెప్పారు.

రోజురోజుకు దర్శన్ కేసు బాగా చిక్కుముడిగా తయారవుతుంది. దర్శన్ అక్రమాలు బయటపడుతున్నాయి. పోలీసులు పక్కా ఆధారాలను తయారుచేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దర్శన్ మేనేజర్ సూసైడ్ చేసుకోవడం మరింత అనుమాస్పదంగా మారింది. దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
బెంగళూరు ఫామ్‌హౌస్‌లో చనిపోయినట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. శ్రీధర్ వీడియో సందేశంతో పాటు సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీధర్ తన సూసైడ్ నోట్‌లో ఒంటరితనానికి గురవుతున్నట్లు తెలిపాడు. తన చావుకు ఎవరు కారణం కాదని కూడా చెప్పుకొచ్చాడు.

శ్రీధర్ మృతి కేసుపై పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికేఅభిమాని హత్యకేసులో నలిగిపోతున్న దర్శన్ కు ఈ ఆత్మహత్య కేసు కూడా తోడు అయ్యింది. ఇప్పటివరకు లేని ఒంటరితనం ఇప్పుడే ఎందుకు వచ్చింది. రేణుక స్వామి హత్యకేసుతో మేనేజర్ శ్రీధర్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇకపోతే దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చాడు. అతనికి వివాదాలేమి కొత్త కాదు. భార్య విజయలక్ష్మితో గొడవ పడి దాడి చేసిన ఘటనలో గృహహింస కేసులో 14 రోజుల జైలుకెళ్ళాడు.అనంతరం ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడిగా మారాడు. ఈ రెండు కూడా రాజీ చేసి ఏదో విధంగా బయటపడ్డాడు. ఇక ఇవే కాకుండా ఎన్నోసార్లు బయట దాడి చేస్తూ.. రౌడీఇజం చేస్తూ వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు మర్డర్ కేసు కూడా యాడ్ అయ్యింది. మరి దర్శన్ ఈ కేసు నుంచి బయటపడతాడా? శిక్ష అనుభవిస్తాడా? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











