Who is Pavithra Gowda? పవిత్ర గౌడ ఎవరు? దర్శన్ అరెస్ట్‌, రేణుక స్వామి హత్యకు సంబంధమేంటి?

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్‌తో కన్నడ సినీ పరిశ్రమ భారీ కుదుపుకు గురైంది. రేణుక స్వామి అనే అభిమాని హత్య కేసులో ఆయనను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అయితే దర్శన్ అరెస్ట్ తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పవిత్ర గౌడ. అయితే ఈ కేసులో పవిత్ర గౌడను కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే పవిత్ర గౌడ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆమె గురించిన వివరాల్లోకి వెళితే..

పవిత్ర గౌడ కెరీర్ విషయానికి వస్తే.. కన్నడ సినీ పరిశ్రమలో నటి, ఫ్యాషన్ డిజైనర్, దక్షిణాది సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు. 2016 సంవత్సరంలో 54321 అనే చిత్రంలో నటించడం ద్వారా కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చత్రిగాలు సార్ చత్రిగాలు, ఆగమ్య, సాగువ దారియాలి అనే చిత్రాల్లో నటించారు.

Who is Pavithra Gowda How actress linked to Darshan in Renuka Swamy Murder Case

పవిత్ర గౌడ నటిగానే కాకుండా ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా రాణిస్తున్నారు. బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో అనే ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. సంప్రదాయంగా ఉంటే చీరెలను డిజైన్ చేయడంలో మంచి పేరు ఉంది. కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్‌కు మంచి పాపులారిటీ ఉంది.

పవిత్ర గౌడకు హీరో దర్శన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. భర్తతో విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దర్శన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటం వివాదంగా మారింది. తన కూతురు ఖుషీ పుట్టిన రోజు వేడుకలో దర్శన్ పాల్గొనడం ద్వారా వారికి ఉన్న సంబంధం బయటకు వచ్చింది.

Who is Pavithra Gowda How actress linked to Darshan in Renuka Swamy Murder Case

అయితే దర్శన్, పవిత్ర గౌడ సంబంధాలపై రేణుక స్వామి అనే అభిమాని అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఆ వ్యాఖ్యల తర్వాత ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. దాంతో దర్శన్, పవిత్రపై అనేక అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో దర్శన్, పవిత్రపై కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్‌లో రెండు నెలల క్రితం కేసు నమోదైంది. తాజాగా విచారణ నిమిత్తం పవిత్ర గౌడను అదుపులోకి తీసుకోగా.. దర్శన్‌ను మంగళవారం (జూన్ 11వ తేదీ) ఉదయం అరెస్ట్ చేయడం కన్నడ సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X