»   » షాకిస్తున్న ‘కెజిఎఫ్’ ట్రైలర్...ఈ మధ్య కాలంలో ఇలాంటిది చూసుండరు!

షాకిస్తున్న ‘కెజిఎఫ్’ ట్రైలర్...ఈ మధ్య కాలంలో ఇలాంటిది చూసుండరు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కన్నడ సినిమాలకు తెలుగునాట ఆదరణ తక్కువే. అయితే తాజాగా విడుదలైన ఓ కన్నడ మూవీ ట్రైలర్ అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సినిమాలోని పాయింట్... మేకింగ్ స్టైల్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు 'వారాహి చలన చిత్రం' అధినేత సాయి కొర్రపాటి.

  1960 నుంచి 1980 మధ్య కాలంలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ముంబైతో ముడిపడిన గోల్డ్ మైన్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ట్రైలర్ ప్రజంట్ చేసిన తీరు కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

  బానిసల్లా బ్రతికే సమూహం గురించేనా?

  బానిసల్లా బ్రతికే సమూహం గురించేనా?

  ట్రైలర్ వినిపించే డైలాగులు సినిమా ఒక కొత్త పంథాలో సాగుతుందని స్పష్టం చేస్తున్నాయి. ‘బయల్దేరాడు... వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. తీసుకెల్లే చోటు గురించి తెలియదు. దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా తెలియదు' అనే డైలాగ్స్ బట్టి ఎక్కడున్నామో తెలియకుండా బానిసల్లా బ్రతికే జన సమూహం గురించి సినిమా సాగుతుందని స్పష్టం చేస్తున్నాయి.

  డైలాగులు అదిరిపోయాయి

  డైలాగులు అదిరిపోయాయి

  ‘కేవలం గిన్నెడు రక్తం చూసి ఇంతలా భయ పడుతున్నావంటే ఇక ముందు జరుగబోయే రక్తపాతాన్ని చూసే ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో... భావోద్వేగాలకు లొంగిపోకు, ఈడ వాటికి విలువ లేదు... అనే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

  ఈ ప్రపంచాన్నే గెలవొచ్చు

  ఈ ప్రపంచాన్నే గెలవొచ్చు

  "నీ వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలవచ్చు"అనే డైలాగ్స్ సినిమా ఓ రేంజిలో ఉంటుందనే అంచనాలు పెంచింది.

  కెజిఎఫ్

  ఈ చిత్రంలో యష్, శ్రీనిధి శెట్టి, అయ్యప్ప, బి సురేష్, శ్రీనివాస్ మూర్తి తదితరుల కన్నడ నటులు నటిస్తున్నారు. వియయ్ కరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 21వ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  Here is the most awaited KGF Trailer Telugu. Presented by Kaikala Satyanarayana, AP / Telangana Distributed by Sai Korrapati - Vaaraahi Chalana Chitram. Starring Yash, Srinidhi Shetty, PRashanth Neel, VijayKiragandur Written & Directed by: Prashanth Neel Starring: Yash, Srinidhi Shetty, Ayyapa, B Suresh, Srinivas Murthy, Archana Jois, Roopa Rayappa, Master Anmol, Ananth Nagu, Malavika, Achut Kumar, Naga Bharana, Dinesh Mangalur, Harish roi, Neenazam Ashwath, introducing Avinash, Ram, Lucky, Vinay.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more