Don't Miss!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నటి అత్యాచారం కేసులో మిస్టరీగా కీలక వ్యక్తి మరణం.. పీకల్లోతు కష్టాల్లో నటుడు దిలీప్..
మలయాళ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారా అనే అనుమానం కలుగుతున్నది. ఈ కేసులో విచారిస్తున్న అధికారులను చంపేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేరళ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ముందస్తు బెయిల్‌కు దిలీప్ దరఖాస్తు చేసుకోవడంతో కేరళ హైకోర్టు ఆయన అరెస్ట్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగేంత వరకు అరెస్ట్ చేయకూడదనే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఓ కీలక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో దిలీప్ పరిస్థితి మరింత దిగజారిన పరిస్థితి కనిపిస్తున్నది. తాజా ట్విస్టు వివరాల్లోకి వెళితే..
దిలీప్ కేసును విచారిస్తున్న అధికారుల కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయన వాడిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర కంప్యూటర్ పరికరాలను స్వాధీన పరుచుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే దిలీప్ మొబైల్ ఫోన్లను రిపేర్ చేసిన సలీష్ అనే వ్యక్తి యాక్సిడెంట్‌లో అనుమానాస్పదంగా కొద్ది నెలల క్రితం మరణించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సలీష్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన ఓ డివైడర్‌ను ఢీకొట్టడం.. ఆ ప్రమాదంలో ఆయన మరణించడంపై అనేక అనుమానాలు ఎత్తాయి. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో సలీష్ మరణం కేసును పోలీసుల క్లోజ్ చేశారు. ఆ ఈ క్రమంలో మృతుడు సలీష్ సోదరుడు కోర్టును ఆశ్రయించి.. తన సోదరుడు మరణంపై విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశాడు.

అయితే సలీష్ గతంలో దిలీప్ మొబైల్ ఫోన్లను సర్వీస్ చేశాడు. అంతేకాకుండా దిలీప్ నటించిన సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఆయన మరణం మిస్టరీగా మారింది. దాంతో యాక్సిండెంట్ కాకపోవచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పున: విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, నటుడు దిలీప్ తనకు సంబంధించిన 6 మొబైల్ ఫోన్లను కేరళ హైకోర్టుకు స్వాధీనపరిచారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో దిలీప్ ముందస్తు బెయిల్‌పై కోర్టు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కోర్టు తీసుకొనే నిర్ణయంపై ప్రస్తుతం ఆసక్తిగా ఇండస్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నారు.