»   » స్టార్ హీరోపై బ్యాన్ ఎత్తివేత.... నిరసనగా నలుగురు హీరోయిన్ల రాజీనామా!

స్టార్ హీరోపై బ్యాన్ ఎత్తివేత.... నిరసనగా నలుగురు హీరోయిన్ల రాజీనామా!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మలయాళ హీరోయిన్ కిడ్నాప్, సెక్సువల్ హరాస్మెంట్ కేసులో కేరళ స్టార్ హీరో దిలీప్‌ గతంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ సంఘటన తర్వాత అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) ఆయనపై బ్యాన్ విధించింది. 85 రోజుల పాటు జైల్లో గడిపిన దిలీప్ ఇటీవలే జైలు నుండి బయటకు వచ్చారు.

  నటి పై‌ రేప్ కేసులో హీరో‌పై చార్జ్‌షీట్

  అయితే జైలు నుండి విడుదలైన దిలీప్ ఇటీవల (అమ్మ) మీటింగుకు హాజరయ్యారు. ఆయనపై విధించిన నిషేధాన్ని సైతం ఎత్తివేయడంతో అంతా షాకయ్యారు. పోలీసుల నుండి కానీ, కోర్టు నుండి కానీ అతడికి ఎలాంటి క్లీన్ చిట్ రాక పోయినా..... బ్యాన్ ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిరసనగా బాధిత హీరోయిన్‌తో మరో ముగ్గరు హీరోయిన్లు రాజీనామా చేశారు.

   నలుగురు హీరోయిన్ల రాజీనామా

  నలుగురు హీరోయిన్ల రాజీనామా

  ఈ పరిణామాల నేపథ్యంలో తాను ‘అమ్మ' నుండి తప్పుకుంటున్నట్లు బాధిత హీరోయిన్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. భావనకు సంఘీభావంగా మరో ముగ్గరు మలయాళం హీరోయిన్స్ రమ్య నంబీశన్, రీమా కలింగల్, గీతూ మోహన్‌దాస్ ‘అమ్మ' నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

  ‘అమ్మ' హెడ్ మోహన్ లాల్ ఎలా స్పందిస్తారో?

  ‘అమ్మ' హెడ్ మోహన్ లాల్ ఎలా స్పందిస్తారో?

  బాధితురాలుకు అండగా న్యాయం వైపు ఉండాల్సిన ‘అమ్మ' దిలీప్‌కు మళ్లీ సభ్యత్వం కల్పించడంపై వీరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత నటితో పాటు నలుగురు హీరోయిన్లు ‘అమ్మ' నుండి తప్పుకోవడంపై అసోసియేషన్ హెడ్ మోహన్ లాల్ ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశం అయింది.

   కొత్తగా సంఘం ఏర్పాటు

  కొత్తగా సంఘం ఏర్పాటు

  కేరళ నటీమణులు ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టవ్' అనే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ నాయకత్వం వహిస్తున్నారు. దిలీప్-కావ్యా మాధవన్ ఎఫైర్ వివాదంలో మంజు వారియర్‌కు బాధిత హీరోయిన్ సహాయం చేసిందనే కోపంతోనే ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

  2017 ఫిబ్రవరి 17న రాత్రి

  2017 ఫిబ్రవరి 17న రాత్రి

  2017 ఫిబ్రవరి 17న రాత్రి బాధిత హీరోయిన్‌ను ఆమె కారులోనే కిడ్నాప్ చేసి... రెండు గంటల పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పల్సర్ సునీల్, అతడి గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. వారితో ఈ పని చేయించింది దిలీప్ అనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

  English summary
  Last year, Mollywood actor Dileep was expelled from AMMA following his arrest in connection with the Malayalam actress assault case. And, as expected, this had created a buzz in the industry. While the star initially spent 85 days in jail, he was ultimately granted bail much to the dismay of many in the industry. Dileep was recently taken back into AMMA on the grounds that the charges against him have not been proved yet. Not surprisingly, this decision did not go down well with several members of the film fraternity. The row over the reinstatement of accused actor Dileep into an artistes body took a turn on Wednesday with four leading actresses, including the kidnap victim, resigning from the Association of Malayalam Movie Actors.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more