Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్ళైనా పర్వాలేదు, నీతో వచ్చేస్తా.. సూసైడ్ చేసుకోవద్దు, నటితో సీక్రెట్ ఎఫైర్ లీక్!
మలయాళీ నటుడు దిలీప్ చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేయించిన కేసులో దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి ఫ్యామిలీ లైఫ్ కూడా వివాదభరితమే. తన మాజీ భార్య మంజు వారియర్ నుంచి విడిపోయిన అనంతరం దిలీప్ నటి కావ్య మాధవన్ ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2016లో జరిగింది. వీరిద్దరి మధ్య సీక్రెట్ గా జరిగిన ఎఫైర్ గురించి మలయాళీ జర్నలిస్ట్ రత్నకుమార్ పలు విషయాలని లీక్ చేసింది. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన సీక్రెట్ గురించి వీడియోలో పెడుతూ ఆయన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.

అప్పటి నుంచే ఎఫైర్
దిలీప్ మంజు వారియర్ ల వివాహం 1998లో జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచే దిలీప్ కావ్య మాధవన్ తో ఎఫైర్ ప్రారంభించాడని రత్నకుమార్ అన్నారు. చంద్రనుదిక్కున్న దీఖిల్ చిత్రంలో నటించడం ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే వీరిద్దరూ రహస్యంగా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. దిలీప్ కు పెళ్ళైన విషయం తెలిసినప్పటికీ అతడిని కావ్య మాధవన్ ప్రేమించడం ప్రారంభించింది.

భార్య నుంచి విడిపోయాక
కావ్య మాధవన్ కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేయాలనీ నిర్ణయించుకున్న సమయంలో దిలీప్ చాలా ఆవేదన చెందాడు. కావ్య మాధవన్ కుటుంబ సభ్యులు ఆమెకు నిషాల్ చంద్రతో వివాహం నిర్ణయించారు. అతడిని పెళ్లి చేసుకోవద్దని దిలీప్ కావ్య మాధవన్ పై తరచుగా ఒత్తిడి తెచ్చేవాడు. ఓ సమయంలో కావ్య స్నేహితురాలు సుజాతో రాయబారం కూడా పంపాడు. నీ వివాహం జరిగితే దిలీప్ సూసైడ్ చేసుకుంటానని అంటున్నట్లు సుజా కావ్య మాధవన్ తో చెప్పింది.

పెళ్ళికి ఐదురోజుల ముందు
దీనితో కావ్య మాధవన్ పెళ్ళికి ఐదురోజుల ముందు నిషాల్ ని పిలిచి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం బలవంతంగా వివాహం చేసేశారు. దీనితో దిలీప్ లో అసహనం మరింతగా పెరిగిపోయింది. రహస్యంగా కావ్యని పిలిచి బెదిరింపులకు కూడా దిగాడు. నీవు నాకు దూరమైతే మనమిద్దరం సన్నిహితంగా గడిపిన ఫోటోలని నిషాల్ తల్లిదండ్రులకు పంపుతా. అవసరమైతే సూసైడ్ కూడా చేసుకుంటా అని బెదిరించాడు.

నీతోనే వచ్చేస్తా
దీనితో కావ్య మాధవన్ అతడికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. నాకు పెళ్ళైనా పర్వాలేదు. నీతోనే వచ్చేస్తా. సరైన సమయం వరకు వేచి చూడు. సూసైడ్ లాంటివి చేసుకోవద్దు అని కోరింది. దిలీప్ కు ఇచ్చిన మాట ప్రకారమే కావ్య పెళ్ళైన ఏడాదికే నిషాల్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత దిలీప్ కూడా తన భార్య మంజు వారియర్ నుంచి విడిపోయాడు. సహజీవనం మొదలు పెట్టిన వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కావ్య, దిలీప్ దంపతులకు ఓ పాప కూడా జన్మించింది.