మలయాళ దృశ్యం 2 మరో రికార్డు.. దుమ్ము రేపేసింది!
ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతో పాటు మరో మూడు భాషల్లో రీమేక్ కాగా అన్ని చోట్లా సూపర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా సీక్వెల్‌ను మలయాళంలో రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అయితే అందుకుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇటీవలే ఏషియానెట్ ఛానెల్‌లో నటుడు మోహన్ లాల్ పుట్టినరోజు సంధర్భంగా ప్రదర్శించబడింది.
ఆ రోజున మొత్తం 6.58 మిలియన్ ఇంప్రెషన్స్‌ను పొందింది. అలా ఈ సినిమా టీఆర్పీలో ఆల్ టైమ్ 3వ స్థానంలో నిలిచింది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ సినిమా టెలికాస్ట్ ఒక రోజు ముందే టెలికాస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. ఒక రకంగా ఇలా పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తుంటే కనీసం నాలుగైదు రోజుల నుంచీ హాడావుడి చేస్తారు. ఆ లెక్కన ఈ సినిమా బుల్లితెర మీద కూడా ఒక అద్భుతమైన విజయం సాధించినట్టే. ఇక ఈ సినిమాని తెలుగులో అదే టైటిల్ తో రూపొందిస్తున్నారు.

మూలకథను హ్యాండిల్ చేసిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెలుగు రీమేక్ చేస్తున్నారు. 'దృశ్యం 2' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో, మొదటి భాగంలో చేసిన ఆర్టిస్టులంతా కనిపించనున్నారు. తెలుగు 'దృశ్యం 2' సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా చేయడంతో త్వరగానే పూర్తయింది. 'దృశ్యం 2'లో హీరో నేరం చేశాడని నిరూపించడం కోసం పోలీసులు ఒక ప్లాన్ వేస్తారు, దానికి విరుగుడుగా హీరో మరో ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ కి షాక్ కాని ఆడియన్స్ బహుశా ఉండకపోవచ్చు. అంతలా నచ్చింది కాబట్టే సినిమాని సూపర్ హిట్ చేశారు.


Click it and Unblock the Notifications











