»   » నీతి తప్పిన దాన్ని, వేశ్య అంటూ ప్రచారం చేస్తున్నారు: హీరోయిన్ ఆవేదన

నీతి తప్పిన దాన్ని, వేశ్య అంటూ ప్రచారం చేస్తున్నారు: హీరోయిన్ ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ నటి గిలు జోసెఫ్ ఇటీవల ఓ మేగజైన్ కవర్ పేజీపై పసిపిడ్డకు పాలు ఇస్తూ ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోపై పెద్ద దుమారమే రేగింది. గిలు జోసెఫ్ చర్యపై కొందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసులు కూడా నమోదయ్యాయి. దీనిపై జరుగుతున్న రాద్దాంతంపై తాజాగా గిలు జోసెఫ్ స్పందించారు.

Open Breastfeeding Campaign 'ఓపెన్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌' : లైంగిక కోణంలో చూస్తున్నారా ?
ఎందుకు వివాదం?

ఎందుకు వివాదం?

గిలు జోసెఫ్ ఫోటోపై వివాదానికి కారణం..... ఈ ఫోటోలో ఆమె స్తనాలపై ఎలాంటి ఆచ్చాన లేకుండా పిసిబిడ్డకు పాలు ఇస్తూ కనిపించడమే. ఈ ఫోటో అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బరితెగింపు చర్యగా కొందరు మండి పడ్డారు.

 పబ్లిసిటీ కోసమే అంటూ విమర్శలు

పబ్లిసిటీ కోసమే అంటూ విమర్శలు

గిలు జోసెఫ్ కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. పెళ్లి కాని నటి ఇలాంటి చేష్టలు ఏమిటి? అంటూ కామెంట్లు చేస్తూ విరుచుకుపడ్డారు.

 దారుణమైన కామెంట్స్

దారుణమైన కామెంట్స్

మరికొందరు ఆమె నీతి తప్పింది, వేశ్య అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గిలు జోసెఫ్ స్పందించారు. విమర్శలు చేస్తున్న వారికి ఆమె ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

తల్లికి బిడ్డ పాలివ్వడం తప్పా? అంటూ గిలు జోసెఫ్ రిప్లై

తల్లికి బిడ్డ పాలివ్వడం తప్పా? అంటూ గిలు జోసెఫ్ రిప్లై

అసభ్యకరంగా ఉన్న గ్రాఫిక్ ఫొటోలను చూడడాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు, వాటిపై ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేదు...., కానీ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ కనిపిస్తే మాత్రం భరించలేక పోతున్నారు, ఇది తప్పు ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు.... అంటూ గిలు జోసెఫ్ రిప్లై ఇచ్చారు.

 పబ్లిసిటీ స్టంట్ కాదు

పబ్లిసిటీ స్టంట్ కాదు

ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు నాపై మండి పడుతున్నారు. ఈ వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. బిడ్డలకు తల్లులు పాలివ్వడం తగ్గిపోతున్న ఈ రోజుల్లో.... దీనిపై చైతన్యం కలిగించడానికే తాను ఇలా చేశాను అని గిలు జోసెఫ్ తెలిపారు.

 రూపాయి కూడా తీసుకోలేదు

రూపాయి కూడా తీసుకోలేదు

దీని కోసం నేను రూపాయి కూడా తీసుకోలేదు. సదుద్దేశ్యంతో జరుగుతున్న అవేర్‌నెస్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా నా వంతు తోడ్పాటును అందించాను అని గిలు జోసెఫ్ తెలిపారు.

 ఇపుడు నీతి తప్పిన దాన్ని, వేశ్యను అయ్యానా?

ఇపుడు నీతి తప్పిన దాన్ని, వేశ్యను అయ్యానా?

నిన్నటి మొన్నటి వరకు తనను గొప్ప కవిగా పొగడ్తలు గుప్పించారు. ఈ ఫోటో మూలంగా ఉన్నట్టుండి నన్ను నీతి తప్పిన దానిగా, వేశ్యగా ముద్ర వేసి ప్రచారం చేస్తున్నారు......ఇదెక్కడి న్యాయం, నన్ను ఇలా చిత్రీకరించడం ఎంత వరకు సబబు అంటూ గిలు జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Gilu Joseph responds to trolls. "I have not earned a single penny out of it and I have been mostly receiving abuses from people. Till yesterday, they were referring to me as a poet and now they are calling me a slut, prostitute. How is this publicity at all?" Gilu Joseph told The Indian Express.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu