నటి పోర్న్ వీడియో వైరల్.. వణికిపోయనంటూ మరో వీడియో రిలీజ్ చేసిన నటి..పోలీసులకు ఫిర్యాదు!
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక విధంగా అమాయకులను మోసం చేసి డబ్బు కొట్టేస్తున్న ముఠాలు కొన్ని అయితే అమ్మాయిల ఫోటోలను సేకరించి వాటిని అసభ్యకరంగా మార్చి సర్క్యులేట్ చేస్తున్న కేటుగాళ్లు కొందరు తయారయ్యారు. అయితే కేరళకు చెందిన ఒక నటికి ఇలాంటి తలనొప్పి ఎదురయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళితే

పోర్న్ వీడియో
మలయాళ నటి రమ్య సురేష్ తాజాగా ఫేస్‌బుక్‌లో ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె తనలాగే ఉన్న ఒక పోర్న్ వీడియో గురించి ప్రస్తావించింది. కొద్ది రోజులుగా ఈ పోర్న్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోలోని మహిళ రమ్య సురేష్‌ను పోలి ఉందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కన్నీరు పెట్టుకుంది.

కళ్ళలో కన్నీరు
ఈ వీడియో గురించి స్పందిస్తూ అలప్పుజ పోలీసు మరియు సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్న ఆమె ఇలాంటి సమయంలో తన భర్త తనకు అండగా నిలిచాడని రమ్య సురేష్ తన వీడియోలో పేర్కొన్నారు. ఇక ఈ అంశం మీద ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళలో కన్నీరు కనిపించింది.

కాళ్ళు చేతులు వణికిపోయాయి
ఇక సదరు వీడియోలోని మహిళను తాను కాదని రమ్య వెల్లడించింది. అలాగే తెలిసిన వారు తనకు ఈ వీడియో షేర్ చేశారని ఆ వీడియో చూసిన వెంటనే ముందు తన కాళ్ళు చేతులు వణికిపోయాయని ఆమె పేర్కొంది. కొంత సేపటి వరకు మైండ్ బ్లాక్ అయ్యిందని ఏం చేయాలో అర్థం కాలేదని ఆ తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశా అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నా ఫేస్ బుక్ పేజీలో కూడా దారుణమైన కామెంట్స్ రావడం మొదలయ్యాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

వీడియో ఎంతమంది చూశారో
ఇక సైబర్ క్రైమ్ అధికారులు తనకు చాలా సహాయం చేశారని పేర్కొన్నారు ఆమె. తాను ఫిర్యాదు చేసిన వెంటనే ఏ వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే ఆ వీడియో బయటికి వచ్చిందో దాని పూర్తి వివరాలు సాధించారని అన్నారు. ఆ వీడియో ఎంతమంది చూశారో చెప్పలేనని పేర్కొన్న ఆమె, అలా చూసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్నది నేను కాదని చెప్పలేనని అందుకే ఈ వీడియో పెడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
Recommended Video

దిగజారను
ఆ వీడియో తన మానసిక ప్రశాంతతను దూరం చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ షేర్ చేసి వాళ్లు పొందే ఆనందం ఏంటో తనకు అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న తన భర్త వీలైనంతగా తనను ఓదారుస్తున్నారని ఈ సమయంలో ఆయన తనకు చాలా అండగా నిలబడ్డాడు అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ వీడియోని ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అవకాశాల కోసం తాను దిగజారిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె చివరిసారిగా నయనతార మరియు కుంచాకో బోబన్ యొక్క నిజాల్ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైంది.


Click it and Unblock the Notifications











