For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌పై దాడి.. కత్తులతో బెదిరించి మెడపై వేటు

  |

  ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జైసన్ జే నాయర్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కేరళలోని కల్లారా ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై మాలీవుడ్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ దాడి ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  Malayalam music Director Jaison J Nair attacked

  కేరళ పోలీసులు మీడియాకు తెలిపిన ప్రకారం.. జైసన్ జే నాయర్ సోమవారం సాయంత్రం చెర్తాలా నుంచి కారులో బయలుదేరి తన నివాసం ఎటుమనూర్‌కు వెళ్తున్నారు. ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో మొబైల్ కాల్ రావడంతో ఆయన కారును ఓ పక్కకు ఆపారు. పంట పొలాలతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. ఆయన ఫోన్ మాట్లాడి తిరిగి బయలు దేరుతుండగా ముగ్గురు యువకులు కారును అడ్డగించారు.

  జైసన్‌తో వాగ్వాదానికి దిగి మీరు కారు పెట్టిన ప్రదేశం యాక్సిడెంట్లకు కారణమయ్యే ప్రదేశం, కాబట్టి నీ కారును ముందుకు తీసుకెళ్లి అక్కడ పార్క్ చేసుకోమని చెప్పారు. ఆ కారును ముందుకు తీసుకెళ్తుండగా అతడిని వెంబడించారు. ఆ రత్వాత అతడిని బెదిరించి తన వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులు ఇవ్వమని జులుం చేశారు. అందులో ఒకరు కత్తి తీసి చంపుతామనని బెదిరించారు. ఆ తర్వాత కత్తితో దాడి చేయబోగా మ్యూజిక్ డైరెక్టర్ తప్పించుకొన్నాడు. దాంతో మెడపైన చిన్న గాయమైంది. పరిస్థితిని గమనించిన జైసన్ జే నాయర్ ఎలాగోలా కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వేగంగా తప్పించుకొన్నాడు అని పోలీసులు తెలిపారు.

  అయితే ముగ్గురు అగంతకుల నుంచి తప్పించుకొన్న తర్వాత ఘటన గురించి జైసన్ సోషల్ మీడియాలో అప్‌డేట్ చేశారు. తనపై దాడి జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు. దాడి ఘటనను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా అది వైరల్ అయింది. ఆయనపై దాడి జరగగానే తన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఫోన్‌లో పరామర్శించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  అయితే జైసన్‌పై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదా యాక్సిండెంటల్‌గా వారు దాడికి పాల్పడ్డారా అనే విషయం ఇప్పుడు మీడియాలో చర్చగా మారింది. అయితే దారి దోపిడి దారులు జరిపిన దాడినా? లేక ఆయనకు పడని వారు ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై జైసన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. తనపై దాడి జరిగినా దాని గురించి మాట్లాడటం లేదనే విషయం మీడియాలో ప్రశ్నగా మారింది. అయితే తన సన్నిహితులతో ఈ దాడి ఘటన చర్చిస్తున్నారని, ఆ దాడి నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు అని చెబుతున్నారు.

  జైసన్ జే నాయర్‌ కెరీర్ విషయానికి వస్తే.. ఆనఛంతమ్ చిత్రంతో మాలీవుడ్‌లోకి 2006 సంవత్సరంలో ప్రవేశించారు. ఆ తర్వాత మిషన్ 90 డేస్ చిత్ర, సుధారీ సుదన్, ఇత్రా మాత్రమ్, అబీ, కదా పరంజా కధా చిత్రాల్లోని పాటలకు సంగీతం అందించారు. మొత్తం 22 సినిమా పాటలకు ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు.

  English summary
  Malayalam music Director Jaison J Nair attacked. As per report, three teenagers took a dagger and threatened Jaison. When they tried to stab him, Jaison got a cut on the throat. He managed to escape from the scene by driving off at speed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X