twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్‌ అవతారం ఎత్తనున్న మోహన్‌లాల్.. కథ తెలిస్తే షాకే.. పోర్చుగల్ నేపథ్యంగా

    |

    గత 40 ఏళ్లుగా కేరళ చిత్రపరిశ్రమను పాలించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొత్త అవతారం ఎత్తనున్నారు. 1980లో మోహన్‌లాల్ తొలిసారి మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి వెనుకకు చూసుకోకుండా దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించారు. నాలుగు దశాబ్దాలుగా యాక్షన్, రొమాంటిక్, డ్రామా, కామెడీ కథా నేపథ్యంతో వచ్చిన చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు. అలాంటి ప్రతిభావంతుడైన మోహన్ లాల్ డైరెక్టర్‌గా మారబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..

     40 ఏళ్లుగా నటుడిగా

    40 ఏళ్లుగా నటుడిగా

    తాను డైరెక్టర్ బాధ్యతల్ని చేపట్టబోతున్నట్టు స్వయంగా మోహన్ లాల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. 40 ఏళ్లుగా నటుడిగా రాణించిన తాను మరో కొత్త బాధ్యతలో ప్రేక్షకులను రంజింప జేయాలనుకొంటున్నాను అని తన బ్లాగ్‌లో వెల్లడించారు. ఇప్పటి వరకు కెమెరా ముందు పనిచేశాను. ఇకముందు కెమెరా వెనుక నా పాత్ర పోషించబోతున్నాను అని చెప్పాడు.

    బరోజ్ చిత్రంతో డైరెక్టర్‌గా

    బరోజ్ చిత్రంతో డైరెక్టర్‌గా

    పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. బరోజ్ అనే 3డీ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాను. పోర్చుగల్ నేపథ్యంగా కథ సాగుతుంది అని మోహన్ లాల్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. బరోజ్ అనే వ్యక్తి వాస్కోడ గామాకు సంరక్షుడిగా ఉండేవాడు. భారత్‌కు నౌకా మార్గం కనిపెట్టే క్రమంలో ఆయనకు సహకరించారు అని కథను వెల్లడించాడు. బరోజ్‌ పాత్రను కూడా తాను పోషిస్తున్నట్టు వెల్లడించారు.

     నటుడిని అవుతానని కలలో కూడా ఊహించలేదు

    నటుడిని అవుతానని కలలో కూడా ఊహించలేదు

    సినీ పరిశ్రమలోకి రావడానికి ముందు నేను నటుడిని అవుతానని కూడా కల కనలేదు. సినిమాలో అవకాశం ఇవ్వమని ప్రాధేయపడలేదు. అయినా నన్ను నటుడిగా 40 ఏళ్లు ప్రేక్షకుల ఆదరించారు. నటుడిగా గుర్తించబడటం, అవార్డులను గెలుచుకోవడం నా జీవితంలో గొప్ప అనుభూతి అని మోహన్ లాల్ ఉద్వేగానికి లోనయ్యారు.

     నటుడిగా మోహన్ లాల్ ప్రస్థానం

    నటుడిగా మోహన్ లాల్ ప్రస్థానం

    మోహన్‌లాల్ 1978లో థిరనొత్తమ్ చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఆయన మానసిక వికలాంగుడిగా నటించాడు. అయితే సెన్సార్ సమస్యల వల్ల ఆ సినిమా రిలీజ్ కావడానికి 25 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత 1980లో ఫాజిల్ దర్శకత్వంలో మంజిల్ విరింజా పూక్కల్ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించాడు ఇప్పటి వరకు ఐదు జాతీయ అవార్డులు, తొమ్మిది సార్లు కేరళ స్టేట్ అవార్డులు మోహన్ లాల్‌ను వరించాయి.

    English summary
    Malayalam superstar Mohanlal took to his blog and announced that he will be making his directorial debut with a 3D film titled 'Barroz', in which he play the titular role. Talking about Barroz, Mohanlal revealed that it's about a man, who took care of Vasco Da Gama's treasure when he invaded India. The actor will also play the leading character in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X