రక్తం మరుగుతుంది.. బలైపోతున్నారు.. నాకు అలాంటి.. లైంగిక వేధింపులపై స్టార్ హీరోయిన్

మలయాళ నటి మంజిమా మోహన్ తమిళ, మలయాళ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తమిళంలో మొదటి కాలుపెట్టినా మలయాళంలో స్టార్‌గా మారారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జామ్ జామ్, దేవరాట్టం చిత్రాల్లో నటిస్తున్నది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో లైంగిక వేధింపులపై కొనసాగుతున్న మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

మీటూ ఉద్యమం మంచిదే

మీటూ ఉద్యమం మంచిదే

సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకోవడం మంచి పరిణామమే. మహిళలకు అభద్రతాభావం తొలగిపోతుంది. కానీ కొందరు దీనిని స్వప్రయోజనాలకు వాడుకొంటున్నారు. పరిశ్రమకు అది మంచి సూచన కాదు అని మంజిమా మోహన్ అన్నారు.

రక్తం మరుగుతున్నదని కామెంట్

రక్తం మరుగుతున్నదని కామెంట్

లైంగిక వేధింపులకు లోనయ్యామని చాలా మంది హీరోయిన్లు దేశవ్యాప్తంగా ముందుకు వస్తున్నారు. వారికి జరిగిన అన్యాయం చెప్పుకోవడం మంచిదే. కానీ కొందరు చెబుతున్న విషయాలతో రక్తం మరిగిపోతున్నది అని అన్నారు. అలాంటి వాటిని ఖండించాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కొందరు మాత్రం బలవుతున్నారు..

కొందరు మాత్రం బలవుతున్నారు..

అయితే కొందరు హీరోయిన్లు, చిన్న పాటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయనే భావన కలుగుతుంది. దాని వల్ల తప్పు చేయని కొందరు బలపోతున్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీటూ ఉద్యమానికి గౌరవం దక్కుతుంది అని మంజిమా మోహన్ అన్నారు.

నాకు అలాంటి అనుభవం కాలేదు

నాకు అలాంటి అనుభవం కాలేదు

నా సినీ కెరీర్‌లో అలాంటి అనుభవాలు నాకు ఎదురు కాలేదు. ఎవరైనా అలాంటి ప్రస్తవన తీసుకువస్తే వెంటనే వాటిపై ఘాటుగా స్పందించే దానిని. నా ముందు ఎంత పెద్దవారున్నా అలాంటి వారిని తీవ్రంగా మందలించేదానిని అని మంజి మోహన్ వెల్లడించారు.

వారిపై లైంగిక ఆరోపణలు రావడం

వారిపై లైంగిక ఆరోపణలు రావడం

తమిళ పరిశ్రమలో సినీ రచయిత వైరముత్తు, డైరెక్టర్ సుశీ గణేషన్, నటుడు రాధారవిపై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరం. అలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తేల్చాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నారు. త్వరలో హిందీలో ఘనవిజయం సాధించి క్వీన్ మలయాళ రీమేక్‌లో నటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X